‘అగ్నిపథ్’కు వ్యతిరేకంగా 24న నిరసన: రైతు సంఘాలు - MicTv.in - Telugu News
mictv telugu

‘అగ్నిపథ్’కు వ్యతిరేకంగా 24న నిరసన: రైతు సంఘాలు

June 21, 2022

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘అగ్నిపథ్‌’కు వ్యతిరేకంగా ఆందోళనలు చేయడానికి రైతు సంఘాలు సిద్దమైయ్యాయి. ఈ నెల 24వ తేదీన నిరసన చేపట్టాలని సంయుక్త కిసాన్ మోర్చా ప్రకటించింది. ‘అగ్నిపథ్’ పై సోమవారం హర్యానాలోని కర్నాల్‌లో సమావేశం ఏర్పాటు చేశారు. పలు విషయాలపై చర్చలు జరిపిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్టు రైతు నేత రాకేష్ తికాయత్ తెలిపారు.

రాకేష్ తికాయత్ మాట్లాడుతూ.. ”జిల్లా, తహసీల్దార్ కార్యాలయాల్లో శుక్రవారం జరిగే నిరసన ప్రదర్శనలకు యువత, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వాలి. భారతీయ కిసాన్ యూనియన్ కూడా నిరసనల్లో పాల్గొంటుంది. బీకేయూ అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా ఈ నెల 30న నిరసనలకు పిలుపునిచ్చింది” అని ఆయన అన్నారు.

మరోపక్క అగ్నిపథ్‌ను అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. తాజాగా అగ్నివీరులకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. ఈ క్రమంలో రైతు సంఘాలు సైతం కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును అడ్డుకునేందుకు ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలతోపాటు రైతు సంఘాలు కూడా ‘అగ్నిపథ్‌’కు వ్యతిరేకంగా ఆందోళనలు చేయడానికి సిద్ధమవుతున్నాయి.