కరోనాతో 25 మంది మృతి.. కొత్తగా 11,739 కేసులు - MicTv.in - Telugu News
mictv telugu

కరోనాతో 25 మంది మృతి.. కొత్తగా 11,739 కేసులు

June 26, 2022

దేశవ్యాప్తంగా కరోనా వల్ల ఆదివారం 25 మంది మరణించారనీ, కొత్తగా 11,739 కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో మొత్తం మరణాల సంఖ్య 5,24,999కి, కేసుల సంఖ్య 4,33,89,973కి చేరింది. ప్రస్తుతం ఆక్టివ్ కేసుల సంఖ్య 92576 గా ఉందని వెల్లడించింది. మరణించిన 25 మందిలో కేరళ 10, ఢిల్లీ 6, మహారాష్ట్ర 4, పశ్చిమ బెంగాల్ 2, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, రాజస్తాన్‌లలో ఒక్కొక్కరు ఉన్నారు. దేశ వ్యాప్తంగా రోజు వారీ పాజిటివిటీ రేటు 2.59, వారం వారీ పాజిటివ్ రేటు 3.25గా నమోదైంది.