బ్రెజిల్ లో భారీ వర్షాలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. ఆగ్నేయ తీర ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా సంభవించిన ఆకస్మిక వరదలు రావడంతో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 24మంది మరణించారు. రెస్య్కూ టీం సహాయక చర్యలు చేపట్టింది. వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించే ప్రయత్నం చేస్తోంది. వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
Floods, landslides kill dozens in Brazil’s Sao Paulo state https://t.co/GAuEWxvawP
— Al Jazeera English (@AJEnglish) February 20, 2023
బ్రెజిల్‌లోని తీర ప్రాంతంలో 600 మిల్లీమీటర్ల (23.62 అంగుళాలు) కంటే ఎక్కువ వర్షం కురిసినట్లు అధికారులు వెల్లడించారు. వేలాది మంది నిరాశ్రయులైయ్యారు. సావో పాలో తీర ప్రాంతంలో భారీ వర్షాలు కొనసాగుతాయని, దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని స్థానిక మీడియా వెల్లడించింది. లాటిన్ అమెరికాలోని అతిపెద్ద నౌకాశ్రయం అయిన శాంటోస్‌లో శనివారం నిమిషానికి 55 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో కూడిన గాలులు (34.18 mph) ఒక మీటర్ కంటే ఎక్కువ ఎత్తులో ఉన్న అలలు వస్తుండంతో సహాయక చర్యలకు అంతరాయం కలిగిందని స్థానిక వార్తా సంస్థ తెలిపింది.