ప్రేమకు కులం, మతం, ప్రాంతం, భాషతో సంబంధం లేదంటుంటారు. అంటే అర్ధం ఏ వయసులో అయినా ప్రేమించవచ్చు. మనసుకు నచ్చిన వారిని పెళ్లి చేసుకోవచ్చు. ప్రేమకే కాదు పెళ్లికి కూడా వయసుతో సంబంధం లేదని చాలా మంది ఇప్పటికే నిరూపించారు. కానీ మధ్యప్రదేశ్‌కు చెందిన ప్రేమికులు మాత్రం తమ లవ్ స్టోరీని చెప్పి అందరూ షాక్ అయ్యేలా చేశారు. వయసును పట్టించుకోకుండా, కేవలం హృదయాలు కలిశాయా లేదా అన్నది మాత్రమే చూసుకుని ఓ 25 ఏళ్ల కుర్రాడు తనకంటే వయసులో 30 ఏళ్లు పెద్దదైన మహిళను ప్రేమించాడు. నాలుగేళ్లుగా 55 ఏళ్ల మహిళను ప్రేమించి, పెద్దల అంగీకారంతో పెళ్లికి సిద్ధమయ్యాడు. ఈ యువగుడి ప్రేమ గోల నెట్టింట్లో లొల్లి లొల్లి చేస్తోంది.
చతుర్పూర్కి చెందిన 25 ఏళ్ల షేక్ అమన్ హస్తకళ దుకాణంలో పనిచేసేవాడు. కొన్నాళ్ల క్రితం ఆ షాప్‌కి మార్త జూలియా అనే మెక్సికన్ మహిళ వచ్చింది. హస్తకళల గురించి తెలుసుకుంది. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య మాటలు కలిశాయి. ఇద్దరూ స్నేహితులయ్యారు. భారత్‌లోని కొన్ని పర్యాటక ప్రాంతాలను కలిసి తిరిగారు. ఆ తరువాత మార్త మెక్సికోకు తిరిగి వెళ్లిపోయింది. అప్పటి నుంచి వీరిద్దరూ తరచుగా ఫోన్లో మట్లాడుకునేవారు. 2021లో కేవలం అమన్‌ని కలిసేందుకే మాత్రమే మార్త ఇండియాకు వచ్చింది. దీంతో వీరిద్దరి మధ్య తెలియని బంధం ఏర్పడింది. దీంతో అమన్‌కు మార్తపై ప్రేమ మొదలైంది. సమయం చూసుకుని తన ప్రేమను బయటపెట్టాడు. మార్త కూడా అమన్ ప్రేమలో పడిపోయింది. అతనితో పెళ్లికి ఓకే చెప్పింది. వీరి లవ్ మ్యారేజ్‌ను పెద్దలూ అంగీకరించారు. అయితే మార్త ఫారెనర్ కావడంతో ప్రభుత్వ సమ్మతి కూడా అవసరం. పెళ్లి ప్రపోజల్‌తో వారి సర్టిఫికేట్లను కోర్టుకు అందించారు. దీంతో అధికారులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. వివాహానికి కోర్టు నుంచి అనుమతి వచ్చిన వెంటనే వీరు పెళ్లి చేసుకోనున్నారు. దీంతో మధ్యప్రదేశ్‌లో వీరి ప్రేమ కథ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఎంత ఘాటు ప్రేమనో అంటూ పాటేసుకుంటున్నారు నెటిజన్లు.