జైలు నుంచి వచ్చాడని 250 కేజీల ఆపిల్ దండ..  - MicTv.in - Telugu News
mictv telugu

 జైలు నుంచి వచ్చాడని 250 కేజీల ఆపిల్ దండ.. 

October 26, 2019

250 kg apple garland to congress leader shivakumar 

తెలుగు వాళ్లకు నానా రకాల పూలదండలు తెలుసు. కేజీల బరువు తూగే గజమాలూ తెలుసు. కరెన్సీ మాలలు కూడా పరిచయమే. కానీ కర్ణాటకలో పళ్లమాలలు తాజా ట్రెండ్. దానికి కొనసాగింపుగా ఈ రోజు తీహార్ జైలు నుంచి విడుదలైన కాంగ్రెస్ అగ్రనేత డీకే శివకుమార్‌ను అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఘనంగా సత్కరించారు. బెంగళూరు చేరుకున్న ఆయనను 250 కేజీల బరువున్న యాపిల్ పళ్ల దండంతో సత్కరించారు. అంత బరువైన దండను మనుషలు మోయలేరు కనుక క్రేన్ తెప్పించి వేశారు. మెడలో వేస్తే ఆయన కుప్పకూలిపోతారు కనుక మెడలో కాకుండా ఆయన వాహనంపై అలంకారంగా వేశారు. యథావిధిగా బాణసంచాను కూడా భారీగా కాల్చిపడేశారు. రాష్ట్ర కాంగ్రెస్ కార్యాలయం వరకు ఈ హడావుడి సాగింది. 

కాంగ్రెస్‌లో చక్రం తిప్పుతున్న శివకుమార్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) అధికారులు మనీల్యాండరింగ్‌ కేసులో అధికారులు గత నెల 3న అరెస్ట్ చేసి తీహార్ జైలుకు పంపారు. అతనికి ఢిల్లీ హైకోర్టు బుధవారం షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది.