2500 Chiranjeevi who led one of Krishna's favorite Sanghas
mictv telugu

2500 కృష్ణ అభిమాన సంఘాల్లో ఒకదాన్ని నడిపిన చిరంజీవి

November 15, 2022

 

‘ఆకాశంలో ఒక తార..’అంటూ పాడిన ఆ సూపర్ స్టార్ ఇప్పుడ ఆ తార చెంతకే చేరాడు. తెలుగు సినిమా మరో దిగ్గజ నటుడిని కోల్పోయిందనే కంటే.. ఒక మంచి మనసున్న మారాజుని తీసుకెళ్లిందని చెప్పొచ్చు. సినిమా అంటేనే అదొక రంగుల ప్రపంచం. పిల్లికి కూడా బిచ్చం వేయాలంటే ఆలోచించే వాళ్లు కోకొల్లలు. కానీ సూపర్ స్టార్ మాత్రం దీనికి అతీతుడు. తన దగ్గరకు వచ్చిన వారికి లేదనుకుండా పెట్టే గుణం ఉంది. అంతేకాదు.. కొందరిని సరైన మార్గంలో నడిపించి మార్గనిర్దేశకుడిగా కూడా మారిన సంఘటనలున్నాయి. అందుకే ఆ మారాజుని అభిమానించే వాళ్లు కూడా ఎక్కువ. ఒకప్పుడు సుమారు 2500 అభిమాన సంఘాలు ఆయన పేరున ఉండేవి. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. తమిళ రాష్ట్రాల్లోనూ ఆయనకు అభిమానులుండే వారంటే అతిశయోక్తి కాదు.

ఆయన పుట్టిన రోజు వచ్చిందంటే అభిమానులు ఒక పండుగలా జరిపేవారు. అసలు ఒక ఫ్లాప్ సినిమా వచ్చిందంటేనే తర్వాత సినిమా చూసేవాళ్లుండరు. చేసే హీరో కూడా ఉండడు. కానీ 14 సినిమాల ఫ్లాప్ తర్వాత వచ్చిన అల్లూరి సీతారామారాజుని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన కృష్ణకు, ఆయన అభిమానులదే ఈ ఘనత అంతా అని చెప్పొచ్చు. 2008 నుంచి ఈ అభిమాన సంఘాలు అన్నీ విలీనమయి సూపర్ స్టార్ మహేష్ కృష్ణ సేనగా ఏర్పడ్డాయి. ఇప్పటికీ ఈ అభిమానం అలాగే కొనసాగుతూనే ఉంది.

సూపర్ స్టార్ కి సామాన్యులు అభిమానులుగా ఉండడం మామూలే. కానీ మెగాస్టార్ కూడా ఈ సూపర్ స్టార్ వీరాభిమాని అని కొందరికే తెలుసు. ఆయనని ఆదర్శంగా తీసుకొనే చిరంజీవి సినిమాల్లోకి వచ్చానని ఒకానొక సందర్భంలో చెప్పడం జరిగింది. అంతేకాదు.. చిరంజీవి పద్మాలయ కృష్ణ ఫ్యాన్స్ యూనిట్ పేరుతో అభిమాన సంఘాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఆ సంఘానికి అధ్యక్షుడిగా చాలా సంవత్సరాలు చిరంజీవి ఉన్నారు. ‘తోడు దొంగలు’ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఈ అభిమాన సంఘం పేరిట విడుదల చేసిన కరపత్రం ఇప్పటికీ చాలా స్పెషల్. అంతటి వీరాభిమాని ఈ సినిమాలో కృష్ణ గారితో కనిపించడం ఇక్కడ మరో విశేషం.