2500 మంది బట్టలు లేకుండా ఫోటోలకు ఫోజులిచ్చారు. - MicTv.in - Telugu News
mictv telugu

2500 మంది బట్టలు లేకుండా ఫోటోలకు ఫోజులిచ్చారు.

November 26, 2022

సమస్యలు లేక ఏదైన అంశాలపై అవగాహన పరిచేందుకు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఎవరి విధానాల్లో వారు పరిస్థితిని తెలియని వారికి తెలియపరిచే విధంగా అవగాహన కల్పిస్తుంటారు. కొందరు రోడ్డుపై ర్యాలీలు వంటి చేస్తే మరికొందరు ప్రచార మాధ్యమాల ద్వారా అవగాహన పరుస్తుంటారు. తాజాగా ఆస్ట్రేలియలో చ‌ర్మ క్యాన్స‌ర్‌పై వినూత్నంగా అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు.

సిడ్నీలో ఉన్న బాండీ బీచ్ వ‌ద్ద శనివారం ఉద‌యం సుమారు 2500 మంది న‌గ్న ఫోటోషూట్‌లో పాల్గొన్నారు. చ‌ర్మ క్యాన్స‌ర్‌పై అవ‌గాహ‌న క‌ల్పించే ఉద్దేశంతో ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. అమెరికా ఫోటోగ్రాఫ‌ర్ స్పెన్స‌ర్ టునిక్ ఈ ప్రాజెక్టును లీడ్ చేశారు. ఆస్ట్రేలియాలో చర్మ క్యాన్సర్ బాధితులు ఎక్కువ మండి ఉండడంతో అక్కడి ప్రజలకు అవగాహన కల్పించే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. బీచ్‌ల్లో న‌గ్నంగా తిరిగేందుకు ఇటీవ‌ల ఆస్ట్రేలియాలో చ‌ట్టం చేశారు. ఆ చట్టాన్ని ఉపయోగించుకుని 2500 మందికి న‌గ్నంగా ఫోటో షూట్ చేశారు.