2,500 ఏళ్ల కిందట మునిగి.. ఇప్పుడు వెలుగులోకి.. - MicTv.in - Telugu News
mictv telugu

2,500 ఏళ్ల కిందట మునిగి.. ఇప్పుడు వెలుగులోకి..

October 23, 2018

పురాతత్వ ఆధారాలకు సంబంధించిన సముద్ర అన్వేషణలో మరో కీలక ఘట్టం. క్రీస్తు పూర్వం 4వ శతాబ్దంలో అంటే దాదాపు 2,500 ఏళ్ల కిందట సముద్రంలో తుపాను వల్ల మునిగిపోయిన గ్రీకు ఓడ వెలుగు చూసింది. అప్పట్లో తెగ వ్యాపారం చేసిన ఈ నౌక నల్ల సముద్రంలో ప్రమాదానికి గురై మునిగిపోయింది.

బ్లాక్ సీ మారిటైమ్ ఆర్కియాలజీ ప్రాజెక్టు దీన్ని గుర్తించింది. సముద్రంలో దొరికిన పురాతన ఓడల్లో చెక్కుచెదరని ఓడ ఇదేనని శాస్త్రవేత్తలు చెప్పారు. సముద్రంలో ఆక్సిజన్ లేకపోవడం వల్ల ఇది భద్రంగా ఉందన్నారు. ప్రసిద్ధి చెందిన సైరన్ వేజ్ అనే గ్రీక్ పాత్రపై కనిపించే ఓడలా ఇది ఉందన్నారు.

దీని పొడవు 75 అడుగులు. ఇది నౌకల శ్మశానంగా పేర్కొన్న ప్రాంతంలోనే 1.3 మైళ్ల లోతులో కనిపించింది. బల్గేరియా తీరంలో రిమోట్ కంట్రోల్డ్ జలాంతర్గామి ద్వారా దీన్ని గుర్తించారు. ‘ఇందులో ప్రయాణించిన 20 మందిని వారిని బ్యాక్టీరియా తినేసి ఉండొచ్చు. దీన్ని పైకి తీసుకురావడం కష్టం. అందుకే అలాగే వదిలేస్తున్నాం.. ’ అని తెలిపారు.