బీజేపీ నేత గోశాలలో 27 ఆవులు బలి - MicTv.in - Telugu News
mictv telugu

బీజేపీ నేత గోశాలలో 27 ఆవులు బలి

August 19, 2017

శకునం చెప్పిన బల్లి కుడితిలో పడిందని సామెత. గోరక్షణ పేరుతో అమాయకులపై, అణగారిన వర్గాలపై దాడులు చేస్తున్న మతఛాందసవాదుల మాటలన్నీ ఒట్టి వాగాండరమే తప్పిస్తే మరేమీ కాదని ఈ ఉదంతం చెబుతోంది. గోవులను రక్షిస్తామని చెబుతున్న వీళ్లే గోవుల ప్రాణాలను నిలువునా తోడేస్తున్నారు.

ఛత్తీస్ గఢ్ లోని దుర్గ్ జిల్లాలోని జమూల్ నగర్ నిగమ్ గ్రామంలో బీజేపీ నేత హరీశ్ వర్మ నడుపుతున్న గోశాలలో 27 ఆవులు మృత్యువాత పడ్డాయి. వందల సంఖ్యలో ఆవులున్న ఈ షెడ్డులో కొన్ని రోజులుగా ఆవులు చచ్చిపోతున్నాయి. ఇక్కడ వాటికి సరైన సౌకర్యాలు లేవని గోసేవ ఆయోగ్ అనే ఎన్జీవో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు షెడ్డుపై దాడి చేశారు. గత మూడు రోజుల్లో అక్కడ 27 ఆవులు చనిపోయినట్టు తేల్చారు. ఆ నెల 15న కుండపోత వానలతో గోడ కూలడంతో అవి తుదిశ్వాస విడిచాయని వర్మ చెబుతున్నారు కానీ సరైన సౌకర్యాల్లేకే చచ్చిపోయాని  గోసేవ ఆయోగ్ అంటోంది. వర్మ చెబుతోందే నిజమైతే కూలిపోయే స్థితిలో ఉన్న గోడను కూలగొట్టి కొత్తది కట్టకుండా ఎందుకు నిర్లక్ష్యం చేశారని ప్రశ్నిస్తోంది.

నిజానిజాలేమిటో తెలుసుకోవడానికి వైద్యులు చచ్చిపోయిన గోమాతల రక్తాలను, ఇతర అవయవాలను సేకరించారు. గోశాలలో ఆవులకు సరైన తిండి లేదని వారంటున్నారు.