27 killed in China's ‘deadliest’ bus crash this year
mictv telugu

బస్సు బోల్తాపడి.. 27 మంది మృతి

September 18, 2022

చైనాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గ్రామీణ గుయిజౌ ప్రావిన్స్‌లోని సంధూ కౌంటీలో ఎక్స్‌ప్రెస్‌వేపై అదుపుతప్పిన బస్సు బోల్తా పడింది. నైరుతి చైనాలో ఆదివారం జరిగిన ఈ బస్సు ప్రమాదంలో 27 మంది మరణించారని, ఈ ఏడాది ఇప్పటివరకు దేశంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదమని పోలీసులు తెలిపారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారని, వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించామని పోలీసులు తెలిపారు.

సంధూ ప్రావిన్స్‌ రాజధాని గ్వియాంగ్‌కు 170 కిలోమీటర్ల దూరంలో ఆదివారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగిందన్నారు. ప్రమాదం సమయంలో బస్సులో మొత్తం 47 మంది ఉన్నారని చెప్పారు. ఈ ప్రమాదం జరిగిన ప్రాంతం పర్వత ప్రాంతంగా పేరొందింది. ఈ ప్రమాదం తెల్లవారుజామున 02.40 నిమిషాలకు ప్రమాదం జరిగినట్లు చైనా రోడ్ నెట్ వర్క్ ట్వీట్ చేసింది. అయితే ఈ ట్వీట్‌ను త్వరాత డిలీట్ చేశారు.