తెలంగాణలో 272కు చేరిన కరోనా కేసులు - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణలో 272కు చేరిన కరోనా కేసులు

April 4, 2020

Coronavirus, Positive, 272 Cases,

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య నేడు 272కు చేరిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు. ఈరోజు 43 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని తెలిపారు. ఈమేరకు ఆయన ప్రెస్‌నోట్ విడుదల చేశారు. తెలంగాణలో కరోనా వైరస్ కమ్యూనిటీ స్ప్రెడ్ జరగలేదని స్పష్టంచేశారు. ‌ప్రస్తుతం పాజిటివ్‌గా నమోదు అవుతున్న కేసులు అన్నీ మర్కజ్ నుంచి వచ్చినవారు లేదా వారితో కలిసినవారు మాత్రమే అని పేర్కొన్నారు. షాద్ నగర్‌లో, సికింద్రాబాద్‌లో చనిపోయినవారు కూడా ఢిల్లీ నుంచి వచ్చినవారితో కలిసినవారే అని తెలిపారు.

ప్రెస్‌నోట్‌లోని అంశాలు ఇలా..

=మర్కజ్ నుంచి 1090 మంది రాష్ట్రానికి వచ్చారు. వారందరికీ కూడా పరీక్షలు నిర్వహిస్తున్నాం. 

=అన్నీ క్వారంటైన్ సెంటర్లలో వైద్యులను నియమించాం. నర్సులు, పారా మెడికల్ సిబ్బంది పూర్తిస్థాయిలో అందుబాటులో ఉన్నారు. అన్నీ సెంటర్స్‌లో N-95 మాస్కులు, PPE కిట్స్ సరిపోయేయన్ని అందుబాటులో ఉన్నాయి.

=వైద్యులు, వైద్య సిబ్బంది భద్రత మా బాధ్యత. వైద్యులపై దాడిచేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం.

=ముఖ్యమంత్రిగారి సూచనతో ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు సీఎస్ మరియు వైద్యశాఖ అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నాం. 

=6 ల్యాబ్‌లు 24 గంటలు పనిచేస్తున్నాయి.

=5 లక్షల N-95 మాస్కులు, 5 లక్షల PPE కిట్లు, 5 లక్షల వైరల్ ట్రాన్సిషన్ కిట్లు, 500 వెంటిలేటర్లు, 4 లక్షల కరోనా టెస్టింగ్ కిట్లు, 20 లక్షల సర్జికల్ మాస్కులు, 25 లక్షల హ్యాండ్ గ్లౌజులు కొనుగోలు చేశాం. 

=గచ్చిబౌలిలో 1500 పడకల ఆసుపత్రి మరో రెండు రోజుల్లో అందుబాటులోకి వస్తుంది.