28 people died in the avalanche
mictv telugu

ద్రౌపది దండ పర్వత మంచు చరియలు విరిగిపడి 28 మంది మృతి

October 4, 2022

ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో దాదాపు 28 మంది పర్వాతారోహకులు మరణించారు. సమాచారం అందుకున్న వెంటనే ఎన్‌డీఆర్ఎఫ్, ఎస్‌డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు ప్రారంభించాయి. ఈ ఘటనపై సీఎం పుష్కర్ సింగ్ ధామి స్పందించారు. ‘ద్రౌపది దండ 2 పర్వతంలో హిమపాతం కారణంగా నెహ్రూ పర్వాతారోహణ సంస్థకు చెందిన 28 మంది ట్రైనీలు మంచులో చిక్కుకుని మరణించారని సమాచారం అందింది. జిల్లా యంత్రాంగం, ఇండియన్ ఆర్మీ, ఐటీబీపీ రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించింద’ని వెల్లడించారు. సహాయక బృందాలను హెలికాప్టర్ ద్వారా ఘటనా స్థలికి తరలించారు.