తప్పులో కాలేసిన యువీ..! - MicTv.in - Telugu News
mictv telugu

తప్పులో కాలేసిన యువీ..!

June 26, 2017

ఆ మ్యాచ్ లో యువరాజ్ ఉన్నాడంటే..అందరీ నజర్ అతనిపైనే ఉంటుంది. ఎంతైనా సిక్సర్ల హీరో కదా.ఆదివారం వెస్టిండీస్ తో జరిగిన రెండో వన్డేలోనే అభిమానుల దృష్టిని ఆకర్షించాడు.ఎలా అంటే

భారత్‌-వెస్టిండీస్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ సేన 105 పరుగుల తేడాతో గెలిచింది. ఈ విక్టరీతో భారత్‌ 1-0 లీడ్ లోకి దూసుకెళ్లింది. తొలి వన్డే వర్షం కారణంగా రద్దైయింది. ఈ మ్యాచ్ లో యువరాజు క్రీజులోకి నడుచుకుంటూ వస్తున్న క్రమంలో అభిమానులు ఆసక్తిగా చూశారు. ఎందుకంటే ఛాంపియన్స్‌ ట్రోఫీకి సంబంధించిన జెర్సీ వేసుకుని వచ్చాడు. కామన్ గా టీమిండియా మేనేజ్‌మెంట్‌ ప్రతి సిరీస్‌ ముందు ప్లేయర్లకు కొత్త కిట్‌ని ఇస్తోంది. ఇంగ్లాండ్‌లో ఛాంపియన్స్‌ ట్రోఫీ తర్వాత భారత జట్టు నేరుగా వెస్టిండీస్‌ టూర్ కు వచ్చింది. ఈ మ్యాచ్‌లో యువీ 14 పరుగులు చేసి హోల్డర్‌ బౌలింగ్‌లో హోప్‌కి క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. డ్రస్సింగ్‌ రూమ్‌కి వెళ్లిన తర్వాత జెర్సీ తప్పుగా ధరించినట్లు గుర్తించిన యువీ.. వన్డే జెర్సీ ధరించి ఫీల్డింగ్‌కి దిగాడు.