3 టన్నుల బంగారం కురిసింది.. జనం ఉంటే తలలు పగిలేవి! - MicTv.in - Telugu News
mictv telugu

3 టన్నుల బంగారం కురిసింది.. జనం ఉంటే తలలు పగిలేవి!

March 15, 2018

నింగి నుంచి వడగళ్ల వాన పడ్డం మనం చూసుంటాం. వడగళ్లకు బదులు బంగారు కడ్డీలు, ప్లాటీనం  పడితే ఎలా ఉంటుంది? రష్యాలో అదే జరిగింది. ఓ కార్గో విమానంలో దాదాపు 9.3 టన్నుల బంగారంను,ప్లాటినంను  తరలిస్తున్నారు. అయితే విమానం రన్ వే నుండి పైకి ఎగిరింది. ఆ ఎగిరిన కొద్ది సేపటికే దాని డోర్ తెరుచుకుంది. అంతే వడగళ్ల వానలా బంగారం కడ్డీలు మొత్తం కింద పడసాగాయి. ఇంకా నయ్యం  విమానం గాల్లోకి లేచిన కొద్ది సేవపటికే డోర్ తెరుచుకుంది కాబట్టి బంగారు కడ్డీలు రన్ వే పై పడ్డాయి.

 అదే కొంత దూరం వెళ్లాక పడుంటే…నెత్తిమీద పడితే తల పగిలేది. భూమ్మీద పడితే జనాల లక్కు పగిలేది. ఎందుకంటే  కింద పడిన బంగారం దాదాపు 3 టన్నులు ఉందట. విమానం తలుపుకున్న హ్యాండిల్‌ చెడిపోవడం వల్లే తలుపు తెరుచుకుందని అధికారులు తెలిపారు. రన్‌వేపై బంగారం పడిపోయిన ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. అబ్బా అందులో ఒక్క కడ్డీ మాకు దొరికినా  ఒంటినిండా నగలు చేయించుకుందుము అని వాటిని చూసిన నెటిజన్లు బాధపడుతున్నారు.