వరుసగా రెండో రోజు ఉగ్రదాడి..ముగ్గురు జవాన్లు మృతి - MicTv.in - Telugu News
mictv telugu

వరుసగా రెండో రోజు ఉగ్రదాడి..ముగ్గురు జవాన్లు మృతి

May 4, 2020

3 army officials passed away in encounter in jammu and kashmirs kupwara

కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఎన్నో దేశాలు ఈ వైరస్ కారణంగా లాక్ డౌన్ లోకి వెళ్లాయి. ఇలాంటి సమయాల్లో కూడా ఉగ్రవాదులు తమ వక్రబుద్ధిని చాటుకుంటున్నారు. భద్రతా సిబ్బందిపై కాల్పులకు తెగబడుతున్నారు. శనివారం కుప్వారా జిల్లా హంద్వారా సెక్టార్లోని చాంజ్‌ముల్లా ఏరియాలో ఉగ్రవాదులకు భద్రతా సిబ్బందికి జరిగిన ఎదురుకాల్పుల్లో కల్నల్ తో సహా ఐదుగురు భద్రతా సిబ్బంది అమరులయ్యారు.

తాజాగా మరోసారి ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. కుప్వారా జిల్లాలోని ఖజియాబాద్ ఏరియాలో సిఆర్‌పీఎఫ్ గస్తీ బృందంపై ఉగ్రవాదులు సోమవారం జరిపిన ఉగ్రదాడిలో ముగ్గురు సిఆర్‌పీఎఫ్ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. ఒక ఉగ్రవాది హతమయ్యాడు. భారత బలగాలపై దాడి సమాచారం తెలియగానే అదనపు బలగాలు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నాయి.