అడవిలో ఉండాల్సిన వన్య మృగాలు జన సంచారంలోకి ప్రవేశించి భయపెడుతున్నాయి. దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో చిరుత పులులు దర్శనమిస్తున్నాయి. తాజాగా ఝార్ఖండ్‌లోని గాడ్వా జిల్లాలను చిరుత భయపెడుతోంది. చిన్నపిల్లలే టార్గెట్‌గా చిరుత దాడులు జరుగుతున్నాయి. కేవలం 10 రోజుల్లోనే ముగ్గురు చిన్నారులు చిరుత దాడుల్లో మరణించడం కలకలం రేపుతోంది. డిసెంబర్ 14న, డిసెంబర్ 10న ఇద్దరు చిన్నారులు చిరుత దాడిలో చనిపోగా తాజాగా మరో చిన్నారి తన ప్రాణాలను కోల్పోయింది. పలామూ డివిజన్లో ఈ వరుస దాడులు జరుగుతున్నాయి.
డిసెంబర్ 14న అదే జిల్లాకు చెందిన భాందారియా ప్రాంతాలో చిన్నారిని పులి చంపేసింది. డిసెంబర్ 10వ తేదిన లాతేహర్ జిల్లాలో 12 ఏళ్ల బాలిక పులి దాడిలో ప్రాణాలు కోల్పోయింది. తాజాగా గర్వా జిల్లాలో సేవదీ గ్రామానికి చెందన ఆరేళ్ల చిన్నారి కూడా చిరుత దాడిలో చనిపోయింది. తన ఇంటి ఆవరణలో మూత్ర విసర్జనకు వెళ్లిన చిన్నారిని పులి ఎత్తుకెళ్లింది. ఇది గమనించిన కుటుంబ సభ్యులు, స్థానికులు పులి కర్రలతో వెంబడించారు. చివరికి ఓ అటవీ ప్రాంతంలో చిన్నారిని చిరుత వదిలిపోయింది. అయితే అప్పటికే ఆమె ప్రాణాలు పోయాయి. అయితే ఈ ముగ్గురిని ఒకే చిరుత చంపినట్లు అటవీ అధికారులు భావించి దానిని బంధించేందుకు తీవ్రంగా గాలిస్తున్నారు.