3 కోట్లకు చేరువలో మైక్‌టీవీ పాట.. అందరికీ థ్యాంక్స్.. - MicTv.in - Telugu News
mictv telugu

3 కోట్లకు చేరువలో మైక్‌టీవీ పాట.. అందరికీ థ్యాంక్స్..

February 21, 2019

పండగలకు పెద్దపీట వేస్తూ మైక్ టీవీ ఎప్పటికప్పుడు కనువిందైన పాటలతో మీ ముందుకు వస్తోంది. మధురమైన పాటల పరంపరను కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో బతుకమ్మ, సంక్రాంతి, ఉగాది, శివరాత్రి, బంజారా, హలీం ఇలా పండగలను పురస్కరించుకుని పాటలను అందిస్తోంది మైక్ టీవీ.

మేం అందించిన ప్రతి పాటకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు మైక్ టీవీని ఎంతో ఆదరిస్తున్నారు. మీరిచ్చే ప్రోత్సాహంతో వరుస పాటలు చేసుకుపోతున్నాం. 2018 సంవత్సరంలో మేం చేసిన సంక్రాంతి పాటకు అపురూప స్పంన వస్తోంది. ఆ పాట రెండు కోట్ల వ్యూస్ దాటి మూడు కోట్లకు చేరువలో వుంది. ఇది చాలా పెద్ద విజయం.

‘భోగిమంటలు.. సంక్రాంతులు.. కనుమ పూజలు.. సరదాలు.. హరిదాసులు.. బసవడాటలు.. భోగిపండ్లతో దీవెనెలు.. ఇవి మూడు రోజుల సందడులు.. రైతు గుండెలో పండగలు..’ అంటూ డాక్టర్ కందికొండ అందించిన సాహిత్యానికి, మంగ్లీ గాత్రం, మేఘ్ ఉహ్ వాట్ ర్యాపింగ్, నందన్ బొబ్బిలి సంగీతంతో వినసొంపైన పాటై ప్రేక్షకులను  అలరిస్తోంది.

దాము రెడ్డి కొసనం ఈ పాటకు దర్శకత్వం వహించారు. పండగలోని ప్రాశస్త్యాన్ని వివరిస్తూ, చూడచక్కని లొకేషన్లలో పాట చిత్రీకరణ కొనసాగింది. ఇప్పటికీ ఈ పాట ఎక్కడో చోట వినబడుతూనే వుంటుంది. ఫోన్లలో చాలామంది రింగ్ టోన్లుగా పెట్టుకున్నారు. ఇప్పటికీ ప్రతిరోజూ మా ఛానల్లో ఈ పాటను వీక్షిస్తున్నారు. మంగ్లీ గాత్రం చాలా బాగుందని, మైక్ టీవీ అద్భుతమైన పాటలను అందిస్తోందని, మీ పాటలు చాలా బాగుంటాయని, పంగగ వచ్చిందంటే మైక్ టీవీ పాట రాలేదేంటని ఎదురుచూస్తుంటామని, అందరికీ భిన్నంగా మీ పాటల్లో తడి, ఆర్థ్రత వుంటాయని.., కామెంట్లలో తెలుపుతున్న ప్రతీ ఒక్కరికీ పేరుపేరునా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇది మీరిచ్చిన విజయం. మీరు ఆదరిస్తున్నారు కాబట్టే మేము మీరు మెచ్చే పాటలను చేస్తున్నామని చెబుతున్నాం. మీ ఆదరణ, ప్రోత్సాహం మాపై ఇలాగే కొనసాగితే మేమింకా మంచి మంచి పాటలు చేస్తామని వాగ్దానం చేస్తున్నాం.