మూడు రోజులుగా మండుతున్న నది...వీడియో - MicTv.in - Telugu News
mictv telugu

మూడు రోజులుగా మండుతున్న నది…వీడియో

February 4, 2020

3 days

అస్సాంలోని నహర్ కటియాలో ఉన్న బుర్హి డిహింగ్ నదిపై మూడు రోజులుగా మంటలు చెలరేగుతున్నాయి. బ్రహ్మపుత్ర నదికి ఉన్న ఉపనదుల్లో బుర్హి డిహింగ్ నది ఒకటి. ఆయిల్ పైప్‌లైన్‌లో లీకేజీయే ఈ మంటలకు కారణమని తెలిసింది. పర్యావరణ ప్రేమికులు ఈ విషయంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనిని ఎవరూ పట్టించుకోవటం లేదని వెల్లడిస్తూ.. ఓ నెటిజన్ దీనికి సంబందించిన వీడియోను ట్విటర్‌లో షేర్ చేశాడు. 

కాగా ఈ సంఘటన గురించి సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇది పర్యావరణానికి విఘాతమని, మంటలను ఆర్పటానికి వెంటనే చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. నది సమీపంలో ఉన్న ఆయిల్ ఇండియా లిమిటెడ్‌కు చెందిన పైప్‌లైన్‌లో చోటుచేసుకున్న సమస్య వల్ల ముడి చమురు బయటకు వ్యాప్తించింది. అది నీటి మీద తేలుతుండగా ఎవరో దానికి నిప్పంటించారు. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు. పరిస్థితి అదుపులోనే ఉందని ఓ అధికారి తెలిపారు. మంటలు ఆర్పడానికి ప్రయత్నాలు చేస్తున్నామని వెల్లడించారు.