అగ్రరాజ్యంలో కాల్పులు కలకలం రేపుతున్నాయి. గతకొన్నాళ్లుగా జరుగుతున్న ఈ కాల్పుల ఘటనల్లో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. కాల్పులను అరికట్టేందుకు అమెరికా ఎన్నికఠిన చర్యలు తీసుకున్నా.ఫలితం లేకుండా పోతోంది. తాజాగా చిగాన్ స్టేట్ యూనివర్శిటీలో కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఒకరు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. మిచిగాన్ స్టేట్ యూనివర్శిటీ పోలీసులు క్యాంపస్‌లో జరిగిన కాల్పుల్లో ముగ్గురు మరణించారని స్థానిక పోలీసులు తెలిపారు. క్యాంపస్ నుంచి విద్యార్థులు బయటకు రావద్దని పోలీసులు విజ్ఞప్తి చేశారు. కాల్పులకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. బుర్కే హాల్, IM ఈస్ట్ అథ్లెటిక్ ఫెసిలిటీ అకడమిక్ భవనం సమీపంలోని రెండుచోట్ల కాల్పులు జరిగాయని యూనివర్సిటీ పోలీసులు ట్విట్టర్‌లో తెలిపారు.
మిచిగాన్ స్టేట్ యూనివర్శిటీ (MSU) ప్రతినిధి ఎమిలీ గురెంట్‌ను ఉటంకిస్తూ, క్యాంపస్‌లో ఒక వ్యక్తి మరణించినట్లు డెట్రాయిట్ న్యూస్ ధృవీకరించింది. ఈ కాల్పుల్లో పలువురు గాయపడినట్లు మిచిగాన్ స్టేట్ యూనివర్శిటీ (ఎంఎస్‌యు) పోలీసులు తెలిపారు. కాగా మిచిగాన్ రాష్ట్ర రాజధాని లాన్సింగ్‌కు వాయువ్యంగా 90 మైళ్ల దూరంలో అనుమానాస్పద వ్యక్తి కనిపించాడు. ఈస్ట్ లాన్సింగ్ పోలీసులు ఈ సమాచారాన్ని ట్వీట్ చేశారు. అనుమానిత యువకుడు, ముసుగు ధరించి ఉన్నాడని తెలిపారు.