3 Died Rtc Garuda Bus Hits Tractor At Kothakota In Wanaparthy District
mictv telugu

హైవేపై ఘోర ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం

November 21, 2022

వనపర్తి జిల్లా కొత్తకోట మండలంలోని జాతీయ రహదారిపై బొమ్మల పల్లి వద్ద ఆదివారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చెరుకు లోడుతో వెడుతున్న ట్రాక్టర్‌ను వెనక నుంచి వచ్చిన గరుడ బస్సు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు చనిపోగా, 16 మందికి గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 48మంది ప్రయాణికులు ఉన్నారు. మియాపూర్ డిపోకు చెందిన గరుడ బస్సు హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. చనిపోయిన ముగ్గురు బస్సులో ప్రయాణిస్తున్న వారే. మృతుల్లో డ్రైవర్, క్లీనర్, ఓ ప్రయాణికుడు ఉన్నారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బస్సు డ్రైవర్‌ ఆంజనేయులు, క్లీనర్‌ సందీప్‌ అక్కడికక్కడే మృతిచెందగా ప్రయాణికుడు శివన్న ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదుచేశామని, దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం జరగడంతో జాతీయ రహదారిపై ముమ్మాళ్లపల్లి నుంచి అమడబాకుల వరకు నాలుగు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో పోలీసులు, హైవే సిబ్బంది ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించారు.