చిన్న, పెద్దా తేడా లేకుండా అందరినీ ఇబ్బంది పెడుతున్నది మధుమేహం. దీనివల్ల గుండె జబ్బులు, రక్తోపోటు, మూత్ర పిండాల సమస్యలు, కంటి సమస్యలు తీవ్రమవుతున్నాయి. మరి డయాబెటిస్ తగ్గించుకునేందుకు ఈ సింపుల్ ఆసనాలు చేసి చూడండి. మధుమేహానికి ప్రధానక కారణం ఒత్తిడి. ఇది శరీరంలో గ్లూకోగాన్ స్రావాన్ని పెంచుతుంది. యోగాసనాలు, వ్యాయామాలు, ధ్యానం మనలోని ఒత్తిడిని తగ్గిస్తాయి. దీనివల్ల ప్రతికూల ప్రభావాల నుంచి మనం బయటపడుతాం. డయాబెటిస్ బారిన పడకుండా కూడా ఉంటాం. అధిక రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి కొన్ని ఆసనాలు మీకోసం..
పవనముక్తాసనం :
ముందు వెల్లకిలా పడుకోండి. ఆ సమయంలో పాదాలు దగ్గరగా ఉండేలా చూసుకోండి. చేతులు పక్కకు పెట్టి గట్టిగా ఊపిరి తీసుకోవాలి. మీరు శ్వాసను వదులుతున్నప్పుడు మీ మోకాళ్లను ఛాతీ వైపు తీసుకురండి. పొత్తికడుపుపై తొడలతో నొక్కి పెట్టండి. కాళ్లను చేతులతో కౌగిలించుకున్నట్లు గట్టిగా పట్టుకోండి. సాధారణ శ్వాసలోనే ఈ ఆసనం వేయాలి. తర్వాత కాసేపటికి వదిలేయాలి. ఇలా ఊపిరి పీలుస్తూ, వదులుతూ ఈ ఆసనాన్ని చేయండి. ఈ భంగిమలో ఉండి పక్కకు ఒరగండి. ఇలా ప్రతీ పక్కకు మూడు నుంచి ఐదు సార్లు చేయాలి.
బాలసన :
ఈ ఆసనం చేయడం చాలా సులభం. దీన్ని చైల్డ్ పోజ్ అని కూడా పిలుస్తారు. ముందు కాళ్లను వెనుక వైపు ఉంచి కూర్చోండి. ఆ తర్వాత మెడను నేల వైపునకు వంచాలి. చేతులను కూడా ముందుకు చాచాలి. ఇలా 12 నుంచి 15 సెకన్ల వరకు ఉ:డాలి. ఇది ఇన్సులిన్ ప్రసరణను పెంచుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది.
సేతు బంధ ఆసనం :
ఈ ఆసనానికి బ్రిడ్జి పోజ్ అని పేరు. ముందుగా వెల్లకిలా పడుకోవాలి. మోకాళ్లను వంచి, కాళ్లను హిప్ భాగం వరకు దూరంగా ఉంచాలి. అరచేతిని కిందకు ఆన్చాలి. చేతుల ద్వారా నేలపై ఒత్తిడిని ఉంచి మెల్లగా వీపు భాగాన్ని పైకి ఎత్తండి. మీ గడ్డం, మీ ఛాతికి తాకేలా చూసుకోండి. ఎటువంట సపోర్ట్ లేకుండా ఈ ఆసనం చేయాలిస. మీ మోకాలు, చీలమండలం సరళ రేఖలో ఉండాలి. తొడలు నేలకి సమాంతరంగా ఉండాలి. కొన్ని సెకన్ల పాటు శ్వాసను మెల్లగా పట్టుకొని, వదులుతూ ఉండాలి. ఇలా రెండుమూడుసార్లు చేయాల్సి ఉంటుంది.