జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాదులు మళ్లీ పేట్రేగారు. పుల్వామా జిల్లాలో శనివారం వేకువజామున పోలీస్ క్యాంపుపై దాడిచేసి ఐదుగురు జవాన్లను పొట్టనబెట్టుకున్నారు. జవాన్ల ఎదురు కాల్పుల్లో ఇద్దరు దుండగులు కూడా హతమయ్యారు.
ఉగ్రదాడిలో ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లు, ముగ్గురు పోలీసులు చనిపోయారని ఆర్మీ తెలిపింది. జనావాసాలున్న ప్రాంతంలో ఈ పోలీసు క్యాంపు ఉందని వెల్లడించింది. ఉగ్రవాదులను 30 మందికిపైగా ప్రజలను సరక్షిత ప్రాంతాలకు తరలించారు.