హైదరాబాద్ శివారుల్లో 3 కిలోల బంగారం - MicTv.in - Telugu News
mictv telugu

హైదరాబాద్ శివారుల్లో 3 కిలోల బంగారం

February 25, 2020

Gold

హైదరాబాద్‌ నగర శివారుల్లో భారీగా బంగారం బయటపడింది. అక్రమంగా ఓ ప్రైవేటు బస్సులో తరలిస్తుండగా డీఆర్‌ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రాయికల్ టోల్‌గేట్ చిలకమర్రి దగ్గరబస్సును ఆపి తనిఖీలు చేశారు. దీంట్లో మూడు కేజీల బంగారాన్ని గుర్తించారు. అడ్డదారిలో ఈ బంగారాన్ని బెంగళూరు నుంచి హైదరాబాద్‌ తరలిస్తున్నట్టుగా అధికారులు చెబుతున్నారు. స్మగ్లర్లను అదుపులోకి తీసుకొని బంగారం సీజ్ చేశారు. 

నలుగురు వ్యక్తులు బెంగుళూరు నుంచి బంగారం తీసుకువస్తున్నట్టు సమాచారం రావడంతో సోదాలు చేపట్టారు. మొత్తం 31 బంగారు కడ్డీలను సీజ్ చేశారు. పట్టుబడిన 3 కేజీల బంగారం ధర రూ. రూ.1.38 కోట్లు ఉంటుందని చెబుతున్నారు. దీని వెనక ఉన్న మాఫియాపై పూర్తి వివరాలను సేకరించే పనిలో పడ్డారు. నలుగురురిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. కాగా ఎన్ని తనిఖీలు చేసినా బంగారం అక్రమ రవాణా చేస్తున్న ముఠాలు రోజుకొకటి వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. దీంతో అధికారులు మరింత నిఘా పెట్టాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.