3 Killed, 2 Injured In Stampede At Rajasthan's Khatu Shyam Temple
mictv telugu

ఆలయంతో తొక్కిసలాట.. ముగ్గురు మహిళలు మృతి

August 8, 2022

రాజస్థాన్‌లోని ఓ ఆలయంలో తొక్కిసలాట చోటుచేసుకుని, ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. మరో ఇద్దరు గాయపడ్డారు. సికర్‌లోని కథు శ్యామ్ జీ ఆలయంలో సోమవారం ఉదయం 5 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గాయపడిన ఇద్దరిని చికిత్స కోసం జైపూర్‌కు తరలించారు. ఆలయ ప్రవేశ ద్వారం వద్ద ప్రమాదం జరిగినట్టు అధికారులు తెలిపారు. శ్రావణ ఏకాదశి కావడంతో కథు శ్యామ్ మందిరానికి భక్తులు పోటెత్తారు. కృష్ణుడి అవతారంగా భావించే స్వామిని ఈ రోజున దర్శించుకుంటే చాలా మంచిదని నమ్ముతారు.

పవిత్ర గ్యారాస్‌ పర్వదినాన్ని పురస్కరించుకుని ఖాటూ శ్యామ్ గుడికి పెద్దఎత్తున భక్తులు పోటెత్తారు. ఉదయం నాలుగున్నర సమయానికే క్యూలైన్లలో బారులు తీరారు. ఆలయం తలుపులు తెరవగానే భక్తులు ఒక్కసారిగా దర్శనం కోసం ఎగబడ్డారు. దీంతో తొక్కిసలాట జరిగింది. ఆ సమయంలో క్యూలో ఉన్న 63 ఏళ్ల మహిళ, మరో ఇద్దరు మహిళలు మరణించారు. మృతుల్లో హిసార్కు చెందిన ఓ మహిళ ఉందని పోలీసులు గుర్తించారు. మిగతా ఇద్దరు మృతులు ఏ ప్రాంతానికి చెందినవారో ఇంకా తెలియలేదు. తొక్కిసలాటలో మరణించిన వారి కుటుంబాలకు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తన ప్రగాఢ సంతాపం తెలిపారు. ఆలయంలో భక్తుల మృతిపై ప్రధాని నరేంద్రమోదీ కూడా విచారం వ్యక్తం చేశారు.