గుడిలో మూడు హత్యలు

రాజస్థాన్ రాష్ట్రంలలోని పాలి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ ఆలయంలో లోపల పూజరి సహా ముగ్గురు వ్యక్తులు హత్యకు గురయ్యారు. బుధవారం దేవుడి దర్శనార్థం భక్తులు గుడికి రాగా ఈ విషయం తెలిసింది. మృతులను పూజారి బల్లూ రాం, స్థానికులైన ధల్లా రాం, కపూరా రాంలుగా గుర్తించారు. దుండగులు గత రాత్రి గుడిలోపలికి చొరబడి పదునైన  యుధాలతో ఈ ముగ్గురిని చంపేశారని పోలీసులు చెప్పారు. ఇంతవరకు ఎవరిటీ అరెస్ట్ చేయలేదని చెప్పారు. పూర్తి ఆధారాలు సేకరిస్తున్నామన్నారు. దుండగులు ఆలయంలోని హుండీ కోసం కానీ లేదా వ్యక్తిగత కక్షలతో కాని దారుణానికి ఒడిగట్టి ఉండొచ్చని భావిస్తున్నారు.

SHARE