వివాదరహితం అవుతుందా.. ‘కరాకరె’ పోస్టర్‌లో మరో 3 ముఖాలు..  - MicTv.in - Telugu News
mictv telugu

వివాదరహితం అవుతుందా.. ‘కరాకరె’ పోస్టర్‌లో మరో 3 ముఖాలు.. 

October 23, 2019

3 more faces in a poster on Kamma Rajyam Lo Kadapa Redlu Telugu Movie

చూస్తుంటే వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయిన రాంగోపాల్ వర్మ తన తదుపరి ‘కమ్మరాజ్యంలో కడపరెడ్లు’ సినిమాను మరింత వివాదాస్పందంగా మార్చేలానే వున్నాడు. ‘ఇది వివాదరహిత సినిమా వివాదాస్పద పాత్రలతో’ అని అంటున్నాడు. దీపావళి సందర్భంగా అక్టోబర్ 27న ఈ సినిమా ట్రైలర్ విడుదల చేయనున్నట్టు వర్మ సోషల్ మీడియాలో ప్రకటించాడు. ఈ క్రమంలో వర్మ ఓ పోస్టర్ వదిలాడు. గతంలో మాజీ ముఖ్యమంత్రి  చంద్రబాబు లుక్‌ను వదిలాడు. తాజాగా విడుదల చేసిన పోస్టర్‌లో బాబు ముఖంతో పాటు మరో మూడు ముఖాలను చూపించాడు. 

దానిని చూసి వర్మ అభిమానులు గుర్తించి కామెంట్లు చేస్తున్నారు. పవన్ కల్యాణ్, కేఏ పాల్, ముఖ్యమంత్రి జగన్, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పాత్రలు అచ్చు గుద్దినట్టు వారిలానే ఉన్నాయని అంటున్నారు. మనుషులను పోలిన పాత్రలను తీర్చిదిద్దటంలో వర్మ తర్వాతే ఏ డైరెక్టర్ అయినా అంటూ స్మైలీ ఎమోజీలు పెట్టేస్తున్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఏపీలో కులమతాలు రాజకీయాలను ఎలా శాసించాయో వర్మ ఇందులో వివాదాస్పద పాత్రలతో చెప్పనున్నాడని అంటున్నారు. ‘జగన్ ఎప్పుడూ సీఎం కాడు, కాలేడు, ఇది శాసనం’ అన్న పవన్ డైలాగ్‌ను వర్మ తప్పకుండా సినిమాలో చూపించి తీరాలని ఓ అభిమాని కోరాడు. మరో అభిమాని ‘కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా ప్రస్తుత పరిస్థితుల మూలంతో రాబోవు భవిష్యత్తుని ఊహించి తీసిన యదార్థ కల్పిత ఊహాచిత్రం’ అని ఛమత్కరించాడు.