శరీరంలో అతి ముఖ్యమైన భాగం కండ్లు. కానీ మనం అసలు పట్టించుకోని భాగం కూడా అదే! దాదాపు 70మంది పెద్దలు తమ జీవితంలో ఏదో ఒక సమయంలో కంటి ఒత్తిడిని అనుభవిస్తున్నారు. అందుకే ఈ సులభమైన మూడు ఆసనాలు వేసి చూడండి.
చాలామంది కంప్యూటర్స్, ఫోన్స్ చూస్తూ కాలం గడిపేస్తుంటారు. అలా చాలా సేపు స్క్రీన్ ని చూస్తూ ఉండడం వల్ల కండ్లు అలసిపోతాయి. కండ్లు పొడిబారుతుంటాయి. అలా అయినప్పుడు కచ్చితంగా కంటి ఆరోగ్యానికి యోగా వల్ల కలిగే ప్రయోజనాల గురించి చాలామందికి తెలియదు. కంటి యోగా వల్ల కండ్ల చుట్టూ ఉండే కండరాలు బలం చేకూరుతాయి. కండ్లకి విశ్రాంతి లభించి ఏకాగ్రత మెరుగుపడుతుంది.
మెల్లగా రుద్దాలి..
అలసిపోయిన కళ్లను శాంతింపచేయడానికి ఏం చేస్తారు? కండ్ల మీద చేతులను ఉంచి మెల్లగా మూసి ఉంచాలి. ఇప్పుడు అరచేతులను కళ్లపై ఉంచాలి. మెల్లగా కండ్లపై ఒత్తిడి కలుగకుండా రుద్దాలి. ఇలా చేస్తే కండ్లు చాలావరకు విశ్రాంతి పొందుతాయి.
దృష్టి పెట్టాలి..
మీ దృష్టి లోపం కలుగకుండా ఉండాలంటే ఈ చిన్నఆసనం వేయండి. సుదూర వస్తువులపై దృష్టి పెట్టంది. ఏదో ఒక దానిపైనే దృష్టి ఉంచండి. దాన్ని మసకబారే వరకు దృష్టి పెట్టండి. ఆ పై మరొక సుదూర వస్తువుకు మారంది. ఇలా రెండు కళ్లపై పని చేసే వరకు ప్రతి కొన్ని సెకన్లకు కేంద్ర బిందువును మార్చడం చేస్తే మంచిది.
రోల్ చేయాలి..
డంబెల్ పట్టుకొని చేతిని కిందకి పైకి అంటుంటాం. అలాగే కళ్లను పక్కకు తిప్పడం చేయాలి. అలాగే కిందకు పైకి ఇలా గుండ్రంగా తిప్పాలి. ఇలా చేయడం వల్ల కండ్ల కండరాలు బలపడుతాయి. కనీసం ఈ వ్యాయామం 10సార్లు చేయాల్సి ఉంటుంది.
చాలా తక్కువ వ్యవధిలో ఈ వ్యాయామాలు చేసుకోవచ్చు. కంప్యూటర్ టేబుల్ దగ్గరే వీటిని చేసుకోవచ్చు. క్రమం తప్పకుండా చేయడం వల్ల దృష్టి చాలావరకు మెరుగుపడుతుంది.