చెరుకు తోటలో బాలికపై 5 మృగాల దాడి.. సోషల్ మీడియాలో పోస్ట్ - MicTv.in - Telugu News
mictv telugu

చెరుకు తోటలో బాలికపై 5 మృగాల దాడి.. సోషల్ మీడియాలో పోస్ట్

September 15, 2020

3 teenagers booked for incident minor girl in UP’s Sitapur

అత్యాచారాలపై చట్టాలు ఎంత పదునెక్కుతున్నా.. కామాంధులు ఇంకా మదమెక్కిన ఆంబోతుల మాదిరే రెచ్చిపోతున్నారు. భయం, జంకు లేకుండా మహిళలు ఒంటరిగా కనిపిస్తే చాలు దురాగతాలకు తెగబడుతున్నారు. ఇది నిత్యకృత్యం అయిపోయింది. తప్పులు చేసినవారికి శిక్షలు పడుతున్నాయి.. కొత్తగా తప్పులు చేసేవారు చేస్తూనే ఉన్నారు. తాజాగా అలాంటి మరో ఘటన వెలుగుచూసింది. మార్కెట్‌కు అని వెళ్లిన బాలికను లాక్కెళ్లి ఐదుగురు కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణాన్ని వారంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. 

ఈ ఘటన యూపీలో చోటుచేసుకుంది. సీతాపూర్ జిల్లాకు చెందిన మైనర్ బాలికపై షీబు, నజీమ్ అనే ఇద్దరు కామాంధులు కన్నేశారు. ఆమె మార్కెట్‌కు వెళ్లొస్తున్నదే అదునుగా భావించారు. ఆమెను అపహరించి సమీపంలోని చెరుకు తోటలోకి లాక్కెళ్లారు. అప్పటికే అక్కడున్న మరో ముగ్గురు స్నేహితులతో కలసి బాలికపై సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. పశువుల్లా మీద పడి అత్యాచారం చేశారు. దాన్నంతా వీడియోలు తీసి పైశాచికానందం పొందారు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించి పంపించేశారు. ఆ బాలిక కూడా వారికి భయపడి ఈ దారుణం గురించి ఎవరికీ చెప్పలేదు. అయితే ఆ వీడియోలు కాస్తా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో ఈ  దారుణం వెలుగులోకి వచ్చింది. చెరుకు తోటలో ఐదుగురు పశువుల్లా బాలిక మీద పడి రేప్ చేస్తున్న వీడియోలు తీవ్ర కలకలం రేపాయి. ఈ ఘటనపై బాధితురాలి తల్లి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వీడియోలను సుమోటోగా తీసుకుని నిందితుడు షీబుని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నారు.