పుల్వామాలో భారీ ఎన్‌కౌంటర్.. నలుగురు ఉగ్రవాదులు హతం - MicTv.in - Telugu News
mictv telugu

పుల్వామాలో భారీ ఎన్‌కౌంటర్.. నలుగురు ఉగ్రవాదులు హతం

January 12, 2020

Jammu Kashmir.

జమ్ము కశ్మీర్‌లోని పుల్వామా ప్రాంతం మరోసారి తుపాకుల మోతలతో దద్దరిల్లింది. ఈ ఎన్‌కౌంటర్‌లో హిజ్బుల్‌ ముజాహిదీన్‌ టాప్‌ కమాండర్‌ హమద్‌ ఖాన్‌ సహా ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. అనంత్‌నాగ్‌లో ముగ్గురు హిజ్బుల్‌ ఉగ్రవాదులను శనివారం భద్రతా దళాలు అరెస్ట్‌ చేసిన మరుసటి రోజే ఈ భారీ ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకోవడం కలకలం రేపుతోంది. 

భద్రతా దళాలు ఆదివారం పుల్వామా ప్రాంతంలోని గుల్షన్‌పురాలో గాలింపు చర్యలు చేపట్టాయి. ఓ నివాస గృహంలో ఉగ్రవాదులు తలదాచుకున్నారని వారికి సమాచారం అందింది. దీంతో ఆ ఇంటిని భద్రతా దళాలు చుట్టుముట్టాయి. భవనం లోపలి నుంచి ఉగ్రవాదులు, భద్రతా దళాలపై కాల్పులు జరిపగా ఎదరు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో హిజ్బుల్‌ ముజహిదీన్‌ టాప్‌ కమాండర్‌ హమద్‌ ఖాన్‌ సహా ముగ్గురు ఉగ్రవాదులు మృతిచెందారు. ఘటనా స్ధలం నుంచి పెద్ద సంఖ్యలో ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.