చావు నోట్లో తలపెట్టడమంటే ఇదే.. పైనుంచి 3 రైళ్లు వెళ్లినా..  - MicTv.in - Telugu News
mictv telugu

చావు నోట్లో తలపెట్టడమంటే ఇదే.. పైనుంచి 3 రైళ్లు వెళ్లినా.. 

October 22, 2019

3 trains pass  .

మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి చావు నోట్లో తల పెట్టి క్షేమంగా బయటపడ్డాడు. ఫూటుగా మందు తాగి రైలు పట్టాలపై పడుకున్నాడు. ఇంతలో అతనిపై నుంచి మూడు రైళ్లు వెళ్లాయి. అక్కడున్నవాళ్లు సహా, పోలీసులు కూడా అతను పోయాడు.. ఛిద్రమైన అతని మృతదేహాన్ని మార్చురీకి తరలించాలని సిద్ధమయ్యారు. ఇంతలో విచిత్రంగా అతను లేచి కూర్చున్నాడు. దీంతో అందరూ ఆశ్చర్యంతో నోళ్లు వెళ్లబెట్టారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని అశోక్‌నగర్‌లో రైలు పట్టాలపై చోటు చేసుకుంది. 

రైలు పట్టాలపై ఓ వ్యక్తి మృతదేహం పడివుందని లోకోమోటివ్‌ పైలట్‌(రైలు డ్రైవర్‌) ఒకరు పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు అక్కడికి చేరుకునేసరికి ఆ మార్గంలో మూడు రైళ్లు వెళ్లాయి. దీంతో అతని మృతదేహం గుర్తు పట్టరానంతగా తునాతునకలు అయి ఉంటుందని భావించారు. పట్టాలపై నుంచి బాడీని తరలిచేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇంతలో అతను స్పృహలోకి వచ్చి తన తండ్రి వస్తాడని చెప్పినట్టు పోలీసులు తెలిపారు. అతడి పేరు ధర్మేంద్ర అని.. మద్యం సేవించి అతడు రైలు పట్టాల మధ్యలో నిద్రపోయాడని పేర్కొన్నారు. అతడు మద్యం మత్తులో ఉండటం వలన తనపై నుంచి మూడు రైళ్లు వెళ్ళిన విషయం తెలియదు. ఆ విషయం చెప్పగానే అతనికి తాగింది మొత్తం దిగింది అని అన్నారు. వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత ధర్మేంద్రను పోలీసులు ఇంటికి పంపించారు.