3 transgender teachers selected for Karnataka govt schools
mictv telugu

రాష్ట్ర చరిత్రలో తొలిసారి.. ప్రభుత్వ టీచర్లుగా ట్రాన్స్‌జెండర్లు

November 20, 2022

హిజ్రాల పట్ల సమాజంలో చిన్నచూపు కాస్త ఎక్కువే. యాచక వృత్తిని మానేసి, సమాజంలో వివక్షతను దాటుకుంటూ వారు కూడా ఇప్పుడు అన్ని రంగాలలో దూసుకెళ్తున్నారు. తమ సత్తా చాటుకుంటున్నారు. అయితే వారు ప్రభుత్వ టీచర్లుగా ఉద్యోగాలు సంపాదించడం గొప్ప విషయమనే చెప్పాలి. కర్ణాటక రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ముగ్గురు ట్రాన్స్జెండర్స్ ప్రభుత్వ ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం- పాఠశాల విద్య, అక్షరాస్యత విభాగం కింద శనివారం తాత్కాలిక ఎంపిక జాబితాను విడుదల చేసింది.

ఈ జాబితాలో 13,363 మంది అభ్యర్థులు ఉన్నారు. వారిలో గ్రాడ్యుయేట్ ప్రైమరీ స్కూల్ టీచర్స్ (జీపీఎస్ఆర్) రిక్రూట్‌మెంట్ జాబితాలో ముగ్గురు ట్రాన్స్జెండర్స్ మొదటిసారిగా ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులుగా నియమితులయ్యారు. రిక్రూట్‌మెంట్ పోస్టులను భర్తీ చేసేందుకు 8 నెలల్లో స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించామని, 10 మంది ట్రాన్స్జెండర్స్ ఈ టెస్ట్లో పాల్గొన్నారని ఆ రాష్ట్ర ప్రాథమిక, మాధ్యమిక పాఠశాల విద్యాశాఖ మంత్రి బీసీ నగేష్ తెలిపారు. వారిలో ముగ్గరు అర్హత సాధించినట్లు చెప్పారు.