మసాజ్ పేరిట ముంబై నుంచి హైదరాబాద్‌కి రప్పించిన ఓ డాన్సర్‌ను ఆమె స్నేహితులే వేధించారు. మసాతో పాటు అందుకోసం వచ్చిన పురుషులతో ఏకాంతంగా గడపాలని, ఎక్కువ డబ్బులిస్తామని ఆశ చూపారు. ముందు సరేనని చెప్పినా.. ఆ తర్వాత ఇష్టం లేక ఆ డాన్సర్ పోలీస్ కంప్లయింట్ ఇచ్చింది. దీంతో ఆగ్రహించిన ఆ ముగ్గురు స్నేహితులు.. ఆమె దుస్తులు తొలగించి, ఓ గదిలో వేసి నిర్బంధించారు. శారీరకంగా దాడి చేశారు. ఈ ఘటన బంజారాహిల్స్ పీఎస్ పరిధిలో జరిగింది.
ముంబయిలో నివాసముంటున్న కాకులి బిశ్వాస్, బంజారాహిల్స్‌లో నివాసముండే సంజనలు ఫేస్బుక్ ఫ్రెండ్స్. బిశ్వాస్.. మంచి డాన్సర్‌తో పాటు మసాజ్ ఎక్స్పర్ట్ కూడా కావడంతో హైదరాబాద్ లో మసాజ్ చేసేందుకు రమ్మని, ఇక్కడ ఎక్కువ డబ్బులిస్తారని ఆశచూపి ఈ నెల 9న హైదరాబాద్‌కు రప్పించింది సంజన. ఆమె చెప్పినట్లుగా ఈ నెల 12న జూబ్లీహిల్స్‌కు వెళ్లిన బిశ్వాస్ కు.. అక్కడే ఉన్న సంజన మరో ఇద్దరు స్నేహితులు కోమటి, సునీతలు.. మసాజ్ కోసం వచ్చిన పురుషులతో ఏకాంతంగా గడపాలని కోరారు. ఆ తర్వాత వారు కోరుకున్న విధంగా ఉండటం లేదని బిశ్వాస్‌పై దాడి చేశారు. చివరకు సంజన కూడా బిశ్వాస్‌ను బెదిరించడంతో.. పోలీసులకు కంప్లైంట్ చేస్తానని హెచ్చిరించింది. ఆగ్రహం చెందిన ఆ ముగ్గురూ.. బిశ్వాస్ దుస్తులు తొలగించి, ఓ గదిలో వేసి నిర్బంధించి, శారీరకంగా దాడి చేశారు. శనివారం ఉదయం వారిబారి నుంచి ఎలాగోలా తప్పించుకున్న బిశ్వాస్.. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. కోమటి, సునీత, సంజనలను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.