బోరుబావిలో పడిన చిన్నోడు మృతి - MicTv.in - Telugu News
mictv telugu

బోరుబావిలో పడిన చిన్నోడు మృతి

May 28, 2020

3 Year Old Boy Falls into Borewell

మెదక్ జిల్లాలో బోరుబావిలో పడిపోయిన మూడేళ్ల చిన్నోడు మరణించాడు. ఆక్సిజన్ అందకపోడంతో ఊపిరాడక మృతి చెందాడు. బాలుడిని రక్షించేందుకు అధికారులు చేసిన శ్రమ వృథా అయింది. దాదాపు 17 అడుగుల లోతులో ఉన్న బాలుడిని 12 గంటల పాటు శ్రమించి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అతి  కష్టం మీద బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్టు   తెలిపారు. దీంతో అతని తల్లిదండ్రులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. అతని శరీరంపై మట్టిపెళ్లలు పడిన గాయాలు కూడా ఉన్నాయని అధికారులు తెలిపారు. 

  పాపన్నపేట మండలం పొడ్చన్‌పల్లిలో బిక్షపతి అనే వ్యక్తి తన పొలంలో మూడు బావులు వేశాడు. వాటిలో నీళ్ల పడకపోవడంతో ఒక్కొక్క దాన్ని పూడ్చుతున్నారు. ఈ సమయంలో నిన్న సాయంత్రం 6 గంటలకు మూడేళ్ల బాలుడు సాయివర్ధన్ ఆడుకుంటూ అందులో పడిపోయాడు. వెంటనే తల్లిదండ్రులు అప్రమత్తమై బయటకు లాగే ప్రయత్నం చేశారు. అయినా లాభం లేకపోవడంతో ఉన్నతాధికారులు వచ్చి సహాయక చర్యలు ప్రారంభించారు. బోరుక సమాంతరంగా బావిని తవ్వి రక్షించే ప్రయత్నం చేసినా ఫలించలేదు. అతడి మృతదేహాన్ని మెదక్ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.సహాయక చర్యలు పూర్తయ్యేవరకు ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌ రెడ్డి, జిల్లా కలెక్టర్‌ ధర్మారెడ్డి, ఎస్పీ చందనా దీప్తి అక్కడే ఉండి సిబ్బందికి సూచనలు చేశారు.