జియోనే టాప్.. ఏకంగా 36.9 కోట్ల మందితో.. - MicTv.in - Telugu News
mictv telugu

జియోనే టాప్.. ఏకంగా 36.9 కోట్ల మందితో..

January 17, 2020

Jio

వినియోగదారుల సంఖ్యాపరంగా దేశంలో అతిపెద్ద టెలికం సంస్థగా రిలయన్స్‌ జియో అవతరించింది. ఈ విషయాన్ని ట్రాయ్ తాజా గణాంకాలు వెల్లడించాయి. 2016లో జియో సేవలు అందుబాటులోకి రాకముందు ఎయిర్‌టెల్‌ అగ్రస్థానంలో ఉండేది. ప్రారంభమైన మూడేళ్ళలోనే జియో ఈ ఘనత సాధించడం గమనార్హం.

2019 నవంబర్‌ నాటికి జియో వినియోగదారుల సంఖ్య 36.9 కోట్లకు చేరుకుందని ట్రాయ్ తెలిపింది. జియో తర్వాతి స్థానంలో 33.62 కోట్ల మంది వినియోగదారులతో వొడాఫోన్‌-ఐడియా, 32.73 కోట్ల వినియోగదారులతో భారతి ఎయిర్‌టెల్‌ రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. అక్టోబర్‌ నాటికి దేశంలో టెలికాం యూజర్ల సంఖ్య 120.48 కోట్లు ఉండగా, నవంబర్‌ ముగిసేసరికి ఆ సంఖ్య 2.4 శాతం తగ్గి 117.58 కోట్లకు చేరుకున్నట్టు ట్రాయ్ తాజా గణాంకాల ద్వారా వెల్లడైంది. వొడాఫోన్‌ ఐడియా 3.6 కోట్ల మంది వినియోగదారులను కోల్పోయినప్పటకీ రెండో స్థానంలో కొనసాగుతుండడం గమనార్హం.