దొంగభక్తి.. రద్దయిన 80 లక్షల నోట్లు సాయిబాబాకు.. - MicTv.in - Telugu News
mictv telugu

దొంగభక్తి.. రద్దయిన 80 లక్షల నోట్లు సాయిబాబాకు..

October 14, 2019

పాత నోట్లు రద్దు అయి దగ్గరదగ్గర మూడేళ్లు అవుతోంది. అయినా ఇంకా ఆ పాత రూ.500, రూ.1000 నోట్లు అక్కడక్కడా దర్శనమిస్తున్నాయి. తమవద్ద వున్న పాతనోట్లను ఏంచేయాలో తోచక కొందరు దేవుడి హుండీలో వేసి చేతులు దులుపుకుంటున్నారు. తాజాగా చండీగఢ్‌లోని సెక్టార్-29లో గల సాయిబాబా ఆలయం హుండీలో పాతనోట్లు ప్రత్యక్షమవడం కమిటీ సభ్యులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కమిటీ సభ్యులు అందరూ కలిసి హుండీలోని నోట్లను లెక్కించడం ప్రారంబించారు. అయితే వారికి ఆ నోట్లలో పాతనోట్లు కనిపించాయి. దీంతో వారు నోరు వెళ్లబెట్టారు. ఆ డబ్బులో రద్దుచేసిన రూ. 500, రూ. 1000 నోట్లు అత్యధికంగా కనిపించాయి.  వాటిని లెక్కించగా రూ. 13 వేల విలువైన నోట్లుగా గుర్తించారు. ఆలయానికి హుండీ ద్వారా సమకూరిన ఆదాయాన్ని లెక్కించాలనుకున్న వారికి ఆ సమయంలో ఏం చేయాలో పాలుపోలేని పరిస్థితి ఎదురైంది. 

Saibaba Temple.

ఈ సందర్భంగా కమిటీ సభ్యులు నలిన్ ఆచార్య మాట్లాడుతూ హుండీలో సమకూరిన మొత్తాన్ని ప్రతినెలా లెక్కిస్తుంటామని అన్నారు. ఇలా రద్దు అయిన పాత నోట్లు హుండీలో ప్రత్యక్షమవడం ఇదే తొలిసారి కాదని.. ఇప్పటివరకూ ఆలయంలోని హుండీలో రూ. 70 నుంచి 80 లక్షల విలువైన పాతనోట్లు లభ్యమయ్యాయని తెలిపారు. నోట్ల రద్దు జరిగి ఇంతకాలమైనా ఇప్పటీకీ పాతనోట్లు కనిపించడం ఆశ్చర్యంగా వుందని అన్నారు.