30ఏళ్ల తర్వాత భారత్ కు బోఫోర్స్... - MicTv.in - Telugu News
mictv telugu

30ఏళ్ల తర్వాత భారత్ కు బోఫోర్స్…

May 18, 2017


30 ఏళ్ల తర్వాత భారత అమ్ములపొదిలోకి కొత్త శతఘ్నులు వచ్చాయి. ఎత్తయిన కొండ ప్రాంతాల్లోని శత్రువులను ఢీకొట్టే సామర్థ్యం ఉన్న వీటిని అమెరికా నుంచి కొన్నారు. మొత్తం 145 శతఘ్నులను కొంటే, వాటిల్లో రెండు బుధవారం భారత్‌కు చేరుకున్నాయి. ఇవి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాన్ని కూడా ఛేదిస్తాయి.
రెండు ఎం-777 ఆల్ట్రా-లైట్‌ హొవిట్జర్‌ ఆయుధాలు భారత్‌కు చేరుకున్నట్లు ఆర్మీ ప్రతినిధులు చెప్పారు. 1980లో తొలిసారి స్వీడన్‌ నుంచి బొఫోర్స్‌ శతఘ్నులను కొనుగోలు చేసిన భారత్‌ ఆ తర్వాత వీటిని తిరిగి ఆర్మీలోకి తీసుకోలేదు. భారత ఆర్మీ ఆయుధ సంపత్తిని మరింత పెంచుకునేందుకు వీటిని కొనుగోలు చేసేందుకు నిర్ణయించుకోని కేంద్రానికి ప్రతిపాదన చేయగా గత ఏడాది జరిగిన కేంద్ర మంత్రి వర్గ సమావేశంలో వీటి కొనుగోలుకు పచ్చజెండా ఊపారు. దీంతో అమెరికాతో మొత్తం 700 మిలియన్‌ డాలర్లతో ఈ ఆయుధాల కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ డీల్‌ కింద మొత్తం 145 శతఘ్నులను భారత ఆర్డర్‌ ఇచ్చింది. వీటిలో 25 ఆయుధాలను బీఏఈ సిస్టిమ్స్‌ను డెలివరీ చేస్తుండగా.. మిగిలిన 120 శతఘ్నులను మహింద్రా కంపెనీ సాయంతో భారత్‌లోనే తయారుచేయనుంది. 153ఎంఎం/39 కాలిబర్‌ సామర్థ్యం కలిగిన ఈ ఆయుధాలను సరిహద్దుల్లోని ఎత్తైన ప్రదేశాల్లో వాడుతారు.