30 american states alligned with nitya's kailasa desam
mictv telugu

బాబోయ్…నిత్యానంద మాయ మామూలుగా లేదుగా….

March 18, 2023

ప్రపంచ దేశాల మీద నిత్యానింద మాయ మామూలుగా లేదు. భారత్ లో రచ్చ రచ్చ అయినా నిత్యానింద గురించి తెలుసుకోలేకపోతున్నాయి. దీనికి అగ్రరాజ్యం అని చెప్పుకుంటున్న అమెరికా కూడా తీసిపోలేదు. అగ్రరాజ్యం అయినంత మాత్రన మేము మోసపోకూడదా అంటూ మరీ వెళ్ళి వెళ్ళి నిత్యానంద బుట్టలో పడింది. అమెరికాలో ఏకంగా 30 నగరాలు నిత్యుడి సృష్టి కైలాస నగరంతో టైఅప్ పెట్టుకున్నాయి. మొన్నటికి మొన్న ఐక్యరాజ్యసమితిని బుట్టలో వేసుకోవడం….విమర్శలు వచ్చిన తర్వాత యూఎన్వో దాన్ని సరిద్దుకుంటామని ప్రటించడం అన్నీ జరిగాయి. అది కూడా అమెరికా పట్టించుకోలేదంటే ఏమనాలో అర్ధం కావడం లేదు.

భారత్‌ నుంచి పరారైన స్వయం ప్రకటిత స్వామీజీ నిత్యానంద, యునైటెడ్‌ స్టేట్స్‌ ఆఫ్‌ కైలాస దేశం పేరిట అమెరికాలోని 30 నగరాలతో సాంస్కృతిక భాగస్వామ్యం చేసుకోవడం ఇప్పుడు అమెరికావ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కనీసం ఆ పేరుతో నగరం ఉందో లేదో కూడా చూడకుండా నగరాలన్నీ వరసగా నిత్యానంద ప్రతినిధుల మాటల్ని నమ్మేశాయంటూ ఫాక్స్‌ న్యూస్‌ విమర్శలు గుప్పించింది. మొదట ఒక నగరంతో మెదలై వరుసగా 30 నగరాలను తమ సోదరి నగరాలను చేసుకుంది నిత్యానంద కైలాస్ దేశం. ఈ ఏడాది జనవరి 12న మొట్టమొదటగా నెవార్క్‌ నగరం సోదరి నగరంగా ఒప్పందం చేసుకుంది. అక్కడ మొదలైన స్వామీజీ హవా అలా పాక్కుంటూ పోయింది. అందరి కళ్ళుగప్పి వరుసగా ఒప్పందాలు చేయించేసుకుంది. రిచ్‌మండ్‌, వర్జీనియా, డైటన్‌, ఒహాయో, ఫ్లోరిడా వంటి పెద్ద నగరాలు కూడా ఇలాంటి ఒప్పందాల్ని చేసుకున్నాయి.

ఒక మనిషితో ఏ రకంగా అయినా లింక్ పెట్టుకుంటేనే అటు ఏడు తరాలు ఇటు ఏడుతరాలు చూసుకుంటారు. వాడు మంచివాడా, చెడ్డవాడా, ఏం చేస్తాడు లాంటి వివరాలన్నీ కూపీ లాగుతారు. అలాంటిది ఒక దేశంతో పెట్టుకోవాలంటే ఎంత రిసెర్చే చేయాలి. ఎన్ని కనుక్కోవాలి. కానీ అమెరికాలో ఉన్న నగరాలకు అస్సలు ా సృహే లేనట్టుంది. ఏమీ తెలుసుకోకుండా ఎవరో కొందరు వచ్చి అడగ్గానే కేలాసతో ఒప్పందాలు చేసేసుకున్నాయి. యునైటెడ్‌ స్టేట్స్‌ ఆఫ్‌ కైలాస గురించి గూగుల్‌లో వెతికినా వివరాలు లభించేవి. కానీ అలాంటి ప్రయత్నాలేవీ అమెరికా నగరాలు చేయలేదు అని ఫాక్స్‌ న్యూస్‌ సంస్థ ఎత్తి పొడిచింది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు…అన్నీ తెలిసాక, ఫాక్స్ న్యూస్ చెప్పాక… ఒప్పందం చేసుకున్న నెవార్క్‌ నగర అధికారులు ఈ పరిణామంపై స్పందించారు. నిజం తెలిసిన వెంటనే ఒప్పందాన్ని రద్దు చేశామని విచారం వ్యక్తం చేశ