30 crores if you join TDP..Rajannadora's hot comments
mictv telugu

టీడీపీలో చేరితే 30 కోట్లు..రాజన్నదొర హాట్ కామెంట్స్

July 2, 2022

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంతి పీడిక రాజన్నదొర సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీలో చేరితే రూ.30 కోట్ల రూపాయలు ఇస్తామని, మంత్రి పదవితోపాటు పిల్లల చదువులు కూడా చూసుకుంటామని తనను టీడీపీ నాయకులు ప్రలోభాలకు గురి చేశారని రాజన్నదొర సంచలన విషయాలను మీడియా ముందు వెల్లడించారు.

విజయనగరంలో శుక్రవారం వైసీపీ జిల్లా స్థాయి ప్లీనరీ సమావేశాలు జరిగిన విషయం తెలిసిందే. సమావేశాలకు హాజరయిన రాజన్పదొర మాట్లాడుతూ..”రాష్ట్రంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు నన్ను తీవ్ర ప్రలోభాలకు గురిచేసే ప్రయత్నం చేశారు టీడీపీ నాయకులు. నేను వైసీపీని వీడి టీడీపీలో చేరితే గనుక నాకు రూ. 30 కోట్లు, మంత్రి పదవి, అమరావతిలో ఇల్లు, నా పిల్లల చదువు బాధ్యతలు కూడా చూసుకుంటామని హామీ ఇచ్చారు. అయితే జగన్‌పై నాకున్న నమ్మకం, అభిమానంతో వాటికి నేను అంగీకరించలేదు. నాడు టీడీపీలోకి వెళ్లకపోవడం వల్లే నేడు మంచి పదవిలో ఉన్నాను” ఆయన అన్నారు.

పీడిక రాజన్నదొర… ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన 2019లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సాలూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచాడు. ఆ తర్వాత 19 సెప్టెంబర్ 2019లో ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎస్టిమేట్స్‌ కమిటీకి చైర్మన్‌గా నియమితుడయ్యాడు. 2022 ఏప్రిల్ 11న జరిగిన మంత్రివర్గ పునర్‌ వ్యవస్థీకరణలో భాగంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా నియమితుడై, వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో గిరిజన సంక్షేమశాఖ మంత్రిగా కొనసాగతున్నారు.