ఆర్టీసీ బస్సు బోల్తా.. 30 మందికి గాయాలు..  - MicTv.in - Telugu News
mictv telugu

ఆర్టీసీ బస్సు బోల్తా.. 30 మందికి గాయాలు.. 

October 21, 2019

bus .

తాత్కాలిక డ్రైవర్ల పుణ్యమా అని యాద్రాద్రి జిల్లా భువనగిరిలో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. భువనగిరి చౌరస్తా వద్ద బస్సు బోల్తాకొట్టింది. పరకాల డిపోకు చెందిన బస్సు హైదరాబాద్‌ నుంచి వరంగల్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 30 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలు అయినట్లు సమాచారం. హైదరాబాద్‌ నుంచి బస్సు వరంగల్‌కు బయలుదేరింది. 

భువనగిరి బైపాస్‌ రోడ్డు వద్దకు రాగానే ఒక్కసారిగా బస్సు అదుపుతప్పి అక్కడ ఉన్న కాలువలోకి దూసుకు వెళ్లింది. దీంతో కొంత మంది ప్రయాణికులు కాల్వలో పడిపోయారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. తాత్కాలిక డ్రైవర్‌ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.