సిబ్బందిని కట్టేసి 30కేజీల బంగారం దోపిడీ - MicTv.in - Telugu News
mictv telugu

సిబ్బందిని కట్టేసి 30కేజీల బంగారం దోపిడీ

February 17, 2020

fcbh

పంజాబ్‌లో పట్టపగలు బాలీవుడ్ సినిమా దృశ్యాన్ని తలపిణిచేలా భారీ దోపిడీ జరిగింది. లూధియానాలో ఉన్న ఇండియా ఇన్ఫోలైన్ ఫైనాన్స్ లిమిటెడ్ గోల్డ్ లోన్ సంస్థ బ్రాంచిలో ఆయుధాలు పట్టుకుని ముసుగులతో ప్రవేశించిన నలుగురు దొంగలు సిబ్బందిని బెదిరించి భారీగా బంగారం ఎత్తుకెళ్లారు. 

కారులో వచ్చిన ఐదుగురిలో ఒకరు కారులో ఉండగా, మరో నలుగురు ఆఫీస్ లోపలి వెళ్లి సిబ్బందిని బెదిరించి తాళ్లతో బంధించారు. వారి నుంచి బంగారం దాచిన లాకర్ల తాళాలు తీసుకుని అందులో ఉన్న 30 కిలోల బంగారు ఆభరణాలు దోచుకున్నారు. దోపిడీకి గురైన బంగారం విలువ రూ.13కోట్లు ఉంటుందని అంచనా. ఈ దోపిడీ కేవలం 20 నిమిషాల్లో పూర్తయింది. ఉదయం 11గంటలకు ఈ చోరీ జరిగింది. దొంగలు అందరూ ఒకే రకమైన బట్టలు ధరించినట్టు అక్కడ రికార్డు అయిన సీసీటీవీ కెమెరాలో కనిపిస్తోంది. వారు వెళ్లిన తర్వాత కాసేపటికి తేరుకున్న గోల్డ్ లోన్ ఆఫీస్ సిబ్బంది అలారం మోగించారు. దోపిడీ జరిగిన సమయంలో గోల్డ్ లోన్ ఆఫీస్ సెక్యూరిటీ సిబ్బంది అక్కడ లేకపోవడం గమనార్హం. ఈ భారీ దోపిడీపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలెట్టారు.