హిమాలయాల్లోని మంచు వేగంగా కరిగిపోతోందా..? ఇక భారీ వరదల నుంచి తప్పించుకోలేమా ? జలవిలయం ముంచుకొస్తుందా..? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఏ క్షణంలోనైనా హిమానీ నదాలు కరిగి విపత్తు సంభవించే అవకాశం ఉందని తేలింది. బ్రిటన్ సైంటిస్టుల జరిపిన పరిశోధనలలో ఈ సంచలన విషయాలు . ఇప్పటికే భారీగా మంచు కరిగిపోతుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మౌంట్ ఎవరెస్ట్పై ఉన్న సౌత్ కల్నల్ గ్లేసియర్ అత్యంత వేగంగా కరిగిపోతున్నట్లు తాజా పరిశోధనలో తేలింది. ప్రధానంగా భారత్, పాకిస్థాన్, పెరూ, చైనాలోనే దేశాల్లోని ప్రజలకు ఈ ముప్పు పొంచి ఉంది. హిమనీనదాల సరస్సులు కరగడం ద్వారా సంభవించే వరదల కారణంగా.. దేశంలో 30 లక్షల మందికి ప్రమాదం ఉన్నట్లు బ్రిటన్‌లోని న్యూక్యాజిల్ యూనివర్సిటీ పరిశోధకులు చేసి తాజా పరిశోధనలు చెబుతున్నాయి.
కరిగిపోవడానికి కారణాలు..
మానవతప్పిదాలతో పాటు భూతాపం పెరిగిపోవడం, వాతావరణ వేడెక్కడం లాంటి అంశాలు హిమనీనదాలు కరిగిపోవడానికి కారణంగా కనిపిస్తున్నాయి. హిమాలయాలకు
మానవ తాకిడి పెరగడం, పేరుకుపోతున్న వ్యర్థాల వల్లే మంచు వేగంగా కరిగిపోతోంది. ఎవరెస్ట్ పర్వత శ్రేణుల్లో గత 2వేల ఏళ్లలో ఏర్పడిన మంచు కేవలం 25ఏళ్లలోనే కరిగిపోయిందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టూరిస్ట్ స్పాట్గా మారిన ఎవరెస్ట్‌పై దాదాపు 12వేల కిలోల మానవ వ్యర్థాలు పోగై ఉన్నట్లు తెలుస్తోంది.
నష్టాన్ని భరించలేం..
సముద్ర మట్టానికి 26,000 అడుగుల ఎత్తులో ఎవరెస్ట్ శిఖరాగ్రానికి కేవలం కిలోమీటర్ దిగువన ఈ సౌత్ కల్నల్ గ్లేసియర్ ఉంది. ఈ గ్లేసియల్ లేక్ అవుట్ బరస్ట్ ఫ్లడ్స్‌తో వచ్చే నష్టం ఊహించనిరీతిలో ఉంటుంది. వందలాది మంది ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుంది. మానవ మనుగడుకు అవసరమైన సౌకర్యాలను నాశనం అవుతాయి. ప్రాంతాలన్నీ నీళ్లలో చిక్కుకునే అవకాశం ఉంటుంది. భూములు నీటమునుగుతాయి.