30 thousand people are applying for Group 4 posts every day in telangana
mictv telugu

గ్రూప్ 4 పోస్టులకు భారీ డిమాండ్.. రోజుకు 30 వేల దరఖాస్తులు

January 10, 2023

30 thousand people are applying for Group 4 posts every day in telangana

తెలంగాణ ప్రభుత్వం 8039 గ్రూప్ 4 పోస్టులకు అనుమతిచ్చిన విషయం తెలిసిందే. దీంతో టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసి అర్హులు, ఆసక్తి గల అభ్యర్ధుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమై మంగళవారంతో 12 రోజులవగా, వారం రోజులుగా దరఖాస్తుల వెల్లువ ప్రారంభమైంది. ఇప్పటివరకు మొత్తం 8039 పోస్టులకు 2 లక్షల 48 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. అంటే దాదాపు రోజుకు సగటున 30 వేల మంది అప్లై చేసుకున్నారన్నమాట. దీంతో ఈ పోస్టులకు ఎంత డిమాండ్ ఉందో అర్ధం చేసుకోవచ్చు. దరఖాస్తులకు ఈ నెల 30 వరకు గడువు ఉండగా, రెట్టింపు సంఖ్యలో దరఖాస్తులు వస్తాయని టీఎస్పీఎస్సీ అంచనా వేస్తోంది. ఎంతో ప్రణాళికాబద్దంగా కష్టపడి చదివితే కానీ గ్రూప్ 4 కొలువు సంపాదించడం కష్టమని, విపరీతంగా ఉన్న పోటీని తట్టుకొని అభ్యర్ధులు సర్వసన్నద్ధం కావాలని నిపుణులు సూచిస్తున్నారు.