300 potholes were buried by auto drivers who became labourers.
mictv telugu

కూలీలుగా మారిన‌ ఆటోడ్రైవ‌ర్లు..300 గుంత‌లు పూడ్చివేత‌

August 24, 2022

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా గుత్తి మండలం బేతాపల్లి గ్రామంలో శిథిలావ‌స్థ‌కు చేరుకున్న రోడ్డును ఒక్కొక్క‌రు రూ.2వేల చొప్పున‌ చందాలను వేసుకొని, రోడ్డుపై ప్ర‌మాద‌క‌రంగా మారిన 300 గుంత‌ల‌కు మ‌రమ్మ‌త్తులు చేసుకున్నారు.అయితే, ఈ పనిలో ఆటోడ్రైవర్లు కూలీలుగా మారటం హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం మ‌ర‌మ్మ‌త్తుల‌కు సంబంధించిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారాయి.

గుంత‌ల‌ను పూడ్చిన అనంత‌రం ఆటోడ్రైవ‌ర్లు మాట్లాడుతూ..”బేతాపల్లి గ్రామంలో ఉన్న‌ పీహెచ్సీకి నిత్యం వంద‌ల మంది రోగులు రహదారిపై రాకపోకలను కొన‌సాగిస్తుంటారు. చెట్నేపల్లి, యంగన్నపల్లి, బేతాపల్లి, ఊటకల్లు గ్రామాల మ‌ధ్య‌ పది కిలోమీటర్ల వ‌ర‌కు రోడ్డుపై దాదాపు 30 గుంత‌లు ఉన్నాయి. వీటికి మరమ్మతులు చేయించాలని చాలాసార్లు అధికారులు, ప్రజాప్రతినిధులకు విన్నవించుకున్నాము. కానీ, ఎవ‌రు ప‌ట్టించుకోలేదు. దాంతో 30 మంది ఆటో డ్రైవర్లం క‌లిసి ఒక్కొక్క‌రం రూ.2వేల రూపాల‌ను చందాలుగా వేసుకొని, సుమారు 30 ట్రాక్టర్ల ఎర్రమట్టితో 300కుపైగా గుంతల‌ను పూడ్చాము. ఈ పనిలో ఆటో డ్రైవర్లే కూలీలుగా మారి, గుంతలను పూడ్చాము” అని అన్నారు.

అయితే, ఈ సంఘ‌ట‌న‌కు సంబంధించిన ఫోటోల‌ను జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ట్వీట్ చేశారు. ఆటో డ్రైవ‌ర్లు తీసుకున్న నిర్ణ‌యం అద్బుత‌మ‌ని, ఇప్పటికైన అధికారులు స్పందించి, ఆయా ప్రాంతాల్లో ఉన్న రోడ్డు స‌మ‌స్య‌ల‌ను క్లియ‌ర్ చేయాల‌ని స్థానికులు కోరుతున్నారు.