3000 per month for the unemployed of Gujarat: Kejriwal
mictv telugu

మేజర్ స్త్రీకి వెయ్యి, నిరుద్యోగులకు మూడు వేలు.. గుజరాత్‌లో హామీ

August 10, 2022

గుజరాత్ లో ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనుండడంతో ప్రధాన పార్టీలన్నీ అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్ ముందుగానే రంగంలోకి దిగి ఆప్ విజయం కోసం బాటలు వేస్తున్నారు. అక్కడ ప్రచారానికి వెళ్లిన కేజ్రీవాల్ బుధవారం పార్టీ నేతలతో కీలక సమావేశం నిర్వహించారు. అందుతో భాగంగా తమ ప్రభుత్వం వస్తే ఇచ్చే పథకాలను ప్రకటించారు. 18 ఏళ్లు దాటిన మహిళలకు రూ. వెయ్యి, నిరుద్యోగ యువతకు రూ. 3 వేలు ఇస్తామని హామీ ఇచ్చారు. అంతకుముందు పేదలకు నెలకు 300 యూనిట్ల విద్యుత్ ఉచితంగా ఇస్తామని పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ‘ఇవేవీ తాయిలాలు కాదు. ఇది ప్రజల హక్కు. వారి డబ్బు తిరిగి వారికే చెందాలి కానీ స్విస్ బ్యాంకు అకౌంట్లలో కాదు’ అని వ్యాఖ్యానించారు. సుదీర్ఘ కాలం పాలించిన బీజేపీ పాలనలో అన్ని వర్గాలు ఇబ్బంది పడుతున్నాయని, ప్రత్యామ్నాయం రావాల్సి ఉందని నొక్కి చెప్పారు. అటు కాంగ్రెస్ పార్టీ కొంత బలహీనపడడంతో ఆ స్థానాన్ని భర్తీ చేయాలని ఆప్ యోచిస్తోంది. అందులో భాగంగా పార్టీలో చేరికలను ప్రోత్సహిస్తోంది.