నిరసన కేక.. వరద వార్షికోత్సవానికి వెల్కమ్.. - MicTv.in - Telugu News
mictv telugu

నిరసన కేక.. వరద వార్షికోత్సవానికి వెల్కమ్..

October 15, 2020

30th floods anniversary

మన దేశంలో చిన్న వర్షానికే వరదలు వచ్చే ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. వరద రాగానే ప్రజా ప్రతినిధులు వస్తారు. చూసి.. ఫోటోలు ఇది వెళ్ళిపోతారు. మళ్ళీ అటువైపు రారు. ఎన్నికలు రాగానే ఓట్ల కోసం మళ్ళీ వస్తారు. అలాంటి ప్రాంతాల్లో ప్రతి సంవత్సరం వరదలు రావడం సర్వసాధారణం అయిపోయింది. అలాంటి ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలులోని ఈబీసీ కాలనీ ఒకటి. అక్కడి ప్రజలు గత ముప్పై ఏళ్లుగా వరదల వాళ్ళ ఇబ్బంది పడుతున్నారు. 

వారి సమస్యను తీర్చాలని ఎన్నోసార్లు ప్రజాప్రతినిధులకు వినతి పత్రం అందించారు. కానీ, ఎవ్వరూ పట్టించుకోలేదు. దీంతో ఈ సారి వినూత్నంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. 30వ వరద వార్షోకోత్సవమని ఓ ఫ్లిక్సీ ఏర్పాటు చేశారు. దానిపై ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా మా ఈబీసీ కాలనీ వరదను తిలకించడానికి విచ్చేయచున్న ప్రజా ప్రతినిధులకు ఇదే స్వాగతం అని రాశారు. ఆ ఫ్లెక్సీని వరద ఉన్న ప్రాంతంలో ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ కాలనీ వాసుల నిరసన వినూత్నంగా ఉందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.