తెలంగాణలో కరోనా మహమ్మారి ప్రభావం ఏమాత్రం తగ్గడం లేదు. రోజురోజు కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. శనివారం రోజు కొత్తగా మరో 31 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్యా 1163కి చేరింది. ప్రస్తుతం 382 ఆక్టివ్ కరోనా కేసులున్నాయి.
శనివారం రోజున 24 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు మొత్తం 751 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి చనిపోయిన వారి సంఖ్య 30కి చేరింది. దేశంలో కరోనా వైరస్ కేసుల విషయానికి వస్తే.. ఇప్పటివరకు 62,939 కరోనా కేసులు నమోదయ్యాయి. వాటిలో 19,358 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. 2,109 మంది కరోనా మహమ్మారి బారిన పడి మరణించారు.