31వేల కోట్లు వచ్చి పడ్డాయి.. - MicTv.in - Telugu News
mictv telugu

31వేల కోట్లు వచ్చి పడ్డాయి..

September 5, 2017

నోట్ల రద్దు లీలలు ఇన్నిన్ని కాదు. గత ఏడాది రూ. 500, రూ. 1000 నోట్లను రద్దు చేశాక అనేక కుంభకోణాలు వెలుగుచూడ్డం తెలిసిందే. మరో కుంభకోణం తాజాగా బయటపడింది. నోట్ల రద్దుకు ముందు పనిచేయకుండా.. అంటే ఎలాంటి లావాదేవీలూ జరపని 80 లక్షల నిద్రాణ ఖాతాలు ఉన్నట్టుండి క్రియాశీలం అయ్యాయి. గత ఏడాది నవంబర్ 8 నుంచి డిసెంబర్ 31వరకు(నోట్లమార్పిడికి తుదిగడువు) ఈ ఖాతాల్లో రూ. 31, 300 కోట్ల నగదు డిపాజిట్లు వచ్చి పడ్డాయి. ఈ ఖాతాలను నిర్వహిస్తున్న బ్యాంకులే ఈ వివరాలు వెల్లడించాయి. సమాచార హక్కు చట్టం కింద దాఖలైన దరఖాస్తుకు ఈ వివరాలు తెలిపాయి. పంజాబ్ లో  ఇలాంటి ఖాతాల్లో అత్యధికంగా రూ.4800 కోట్లు డిపాజిట్ అయ్యాయి. యూపీలో రూ.4,167.24 వచ్చిపడ్డాయి. తర్వాతి స్థానాల్లో మహారాష్ట్ర,  గుజరాత్‌ల ఉన్నాయి. అయితే ఇలాంటి నిద్రాణ ఖాతాల్లోకి వచ్చిన డబ్బు వివరాలను వెల్లడించాయి.