ఏపీలో 32 లక్షల మందికి కొత్త వైరస్
ప్రపంచం మొత్తం కరోనా వైరెస్‌తో బాధపడుతుంటే ఏపీలో మాత్రం 32 లక్షల మంది ప్రజలు అవ్వా వైరస్‌తో బాధ పడుతున్నారని సీపీఐ నేత ముప్పాళ్ల నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. ఎన్నికల సమయంలో అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలపై మాట్లాడిన ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. ఆ తర్వాత పట్టించుకోవట్లేదని ఆరోపించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 20 వేల లోపు ఉన్న అగ్రిగోల్డ్ బాధితులకు డబ్బులు చెల్లిస్తామని హామీలు ఇచ్చి మర్చిపోయారని అన్నారు. అవ్వా వారి ఆస్తులు రూ. 5వేల కోట్ల రూపాయల వరకు ఉందని పేర్కొన్నారు.
అసలు ఈ అవ్వా లెక్కలేంటి..? ఈ కొత్త వైరస్ ఏంటని? ప్రజలందరూ తర్జనభర్జనలు పడుతున్నారు. ‘అగ్రిగోల్డ్ బాధితులను ఎన్నికల తర్వాత పూర్తిగా మరిచిపోయారు. 10 లోపు ఉన్నవారికి చెల్లించినప్పుడు అందరూ సంతోషపడ్డారు. ఇంకా 30 వేల మందికి చెల్లించలేదు. అగ్రిగోల్డ్ బాధితులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందని నమ్మకంతో ఉన్నాం. ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన మాట కోసం గత 11 నెలలుగా అగ్రిగోల్డ్ బాధితులు ఎదురు చూస్తున్నారు. రూ.20 వేల లోపు ఉన్న బాధితులకు నేరుగా వారి అకౌంట్‌లకే చెల్లించాలని కోరుతున్నాం’ అని ముప్పాళ్ల తెలిపారు.