33 migrants traveling in mini bus died in Panama road accident
mictv telugu

పనామాలో ఘోరరోడ్డు ప్రమాదం..కొండపై పడిన మినీ బస్సు.. 33 మంది మృతి!!

February 16, 2023

33 migrants traveling in mini bus died in Panama road accident

అమెరికాకు వలసదారులను తీసుకెళ్తున్న మినీబస్సు కొండను ఢీకొట్టి కిందపడిపోయింది. ఈ ప్రమాదంలో 33మంది మరణించారు.ఈ ఘటన బుధవారం తెల్లవారుజామున పనామాలో జరిగింది. డేరియన్ నుంచి వలసదారులను తీసుకెళ్తున్న బస్సు కోస్టారికా సరిహద్దులోని పశ్చిమ తీర ప్రావిన్స్ చిరికిలోని ఈఘటన జరిగింది. పనామా ఇమ్మిగ్రేషన్ డిప్యూటీ డైరెక్టర్ మరియా బస్సులో ఉన్న 33మంది మరణించారని వెల్లడించారు. మృతుల వివరాల గురించి ఆరా తీస్తున్నట్లు తెలిపారు.

ప్రమాదంలో గాయపడినవారికి మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు పనామా అధ్యక్షుడు లారెంటినో కార్డిజో ట్వీట్ చేశారు. పనామా సిటికి పశ్చిమాన 400కిలోమీటర్లదూరంలో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. బస్సులో డ్రైవర్ తో సహా 66మంది ఉన్నారు. ఇందులో 33మంది మరణించారని..మిగిలినవారికి తీవ్ర గాయాలయ్యాయని తెలిపారు. బాధితులంతా సెంట్రల్ అమెరికా, మెక్సీకో, యునైటెడ్ స్టేట్స్ కు చెందినవారికిగా గుర్తించారు.