టెన్త్ క్లాస్ రిజల్ట్స్ కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఓ ఐఏఎస్ అధికారి తన 10వ తరగతి మార్కుషీట్‌ను ట్విట్టర్లో షేర్ చేశారు. పరీక్షలో అనుకున్న మార్కులు రాకపోతే కొంతమంది విద్యార్థులు భావోద్వేగానికి గురై క్షణికావేశంతో ఆత్మహత్య చేసుకుంటున్నారు. కానీ అత్తెసరు మార్కులతో పది పాసైనవారు కూడా ఆ తర్వాత గొప్పగా రాణించి ఉన్నత శిఖరాలను అధిరోహించొచ్చని, అందుకు ఓ కలెక్టరే ఊదాహరణ అంటూ మరో ఐఏఎస్ అధికారి ట్విటర్లో ఓ పోస్ట్ చేశారు.
भरूच के कलेक्टर तुषार सुमेरा ने अपनी दसवीं की मार्कशीट शेयर करते हुए लिखा है कि उन्हें दसवीं में सिर्फ पासिंग मार्क्स आए थे.
उनके 100 में अंग्रेजी में 35, गणित में 36 और विज्ञान में 38 नंबर आए थे. ना सिर्फ पूरे गांव में बल्कि उस स्कूल में यह कहा गया कि यह कुछ नहीं कर सकते. pic.twitter.com/uzjKtcU02I
— Awanish Sharan (@AwanishSharan) June 11, 2022
గుజరాత్‌లోని భరూచ్ జిల్లా కలెక్టర్ తుషార్ డి సుమేరాకు 10వ తరగతిలో ఇంగ్లీష్‌లో 35, మ్యాథ్స్‌లో 36.. మార్కులు సాధించారని, ఆ మార్కుల మెమోను 2009 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అవనిశ్ శర్మ తన ట్విటర్ (twitter) ఖాతాలో పంచుకున్నారు. ‘పదో తరగతిలో సుమేరా కేవలం పాస్ మార్కులనే సాధించారు. ఆయనకు 100కు ఇంగ్లీష్‌లో 35, గణితంలో 36 మార్కులే వచ్చాయి. ఈ మార్కులు చూసి నువ్వేం సాధించలేవు అని చాలామంది అన్నారు’ అంటూ రాసుకొచ్చారు.
ఈ ట్వీట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. అవనిశ్ శర్మ ట్వీట్‌కు సుమేరా స్పందిస్తూ.. ధన్యవాదాలు తెలియజేశారు. 2012 బ్యాచ్‌కు చెందిన సుమేరా ప్రస్తుతం గుజరాత్‌లోని భరుచ్ జిల్లా కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఆర్ట్స్‌లో డిగ్రీ పూర్తి చేసిన ఆయన యూపీఎస్సీలో ర్యాంకు సాధించారు. అంతకుముందు ఓ పాఠశాలలో టీచర్‌గా పనిచేశారు.